సైరన్ నెమ్మదిగా మొదలైంది ....!

Update: 2018-08-28 02:30 GMT

సార్వత్రిక ఎన్నికలకు మరో పదినెలలు ఉండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ తన పని తాను మొదలు పెట్టేసింది. ఏడు జాతీయ పార్టీలు 51 ప్రాంతీయ పార్టీలను పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్నికల సంఘం కోరింది. ముఖ్యంగా ఏడు అంశాలపై క్లారిటీ కోరింది రాజకీయపార్టీలను. మహిళా రిజర్వేషన్లపై కూడా అభిప్రాయాలను ఆహ్వానించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను నమోదు చేసుకుంది ఎలక్షన్ కమిషన్.

బ్యాలెట్ పెట్టండి ...

ఈవీఎం ట్యాపరింగ్ అంటూ ఇటీవల పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా 17 రాజకీయ పార్టీలు బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరడం విశేషం. అయితే బిజెపి ఈ ఆరోపణలపై భగ్గుమంది. ట్యాపరింగ్ అనేది లేనేలేదని స్పష్టం చేసింది. ఇక మహిళా రిజర్వేషన్లపై అన్ని పక్షాలు సానుకూలంగానే స్పందించాయి. లోక్ సభలో ఈ అంశం పై బిల్లు ఆమోదం పొందాలిసి ఉందని దానికి సహకరిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో పేర్కొనడం విశేషం. సవరించిన ఓటర్ల జాబితా పైనా ఎమ్మెల్సీ లకు సైతం ఎన్నికల ఖర్చు నిబంధనలు విధించాలనే అంశంపై చర్చలు సాగాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల జ్వరం ప్రారంభం కాగా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ సైతం తన పని తాను మొదలు పెట్టింది.

Similar News