Ys jagan : జగన్ కు అల్టిమేటం ఇవ్వనున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీ నివేదికను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగుతున్నారు. మరికాసేపట్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు [more]

Update: 2021-11-11 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీ నివేదికను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగుతున్నారు. మరికాసేపట్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు సిద్ధమయింది. జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తారు. ఈ చర్చలు విఫలమయితే ఏం చేయాలన్న దానిపైన కూడా ఉద్యోగ సంఘాలు కసరత్తు చేస్తున్నాయి.

భవిష్యత్ కార్యాచరణపై….?

ప్రభుత్వం తమ డిమాండ్లకు తల ఒగ్గకపోతే ఆందోళనకు దిగాలని ఉద్యోగ సంఘాలు దాదాపుగా నిర్ణయానికి వచ్చాయి. జగన్ ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్లాన్ చేస్తున్నాయి.

Similar News