Ys jagan : జగన్ సర్కార్ కు వార్నింగ్… అదే డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ విధించాయి. ఈ నెలాఖరులోగా పీఆర్సీని ప్రకటించకపోతే ఉద్యమం చేస్తానని చెప్పాయి. ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్వు మీడియాతో [more]

Update: 2021-11-13 06:03 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ విధించాయి. ఈ నెలాఖరులోగా పీఆర్సీని ప్రకటించకపోతే ఉద్యమం చేస్తానని చెప్పాయి. ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్వు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ ని రెండు రోజుల క్రితమే ప్రకటించాల్సి ఉందని, ఈ మేరకు తమకు చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారన్నారు. అయినా ఇంతవరకూ ప్రకటించలేదన్నారు. ఈ నెలాఖరు వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, ఈ లోగా పీఆర్సీ నివేదికను బయట పెట్టకపోతే ఈ నెల 28 వతేదీన జరిగే సమావేశంలో కార్యాచారణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.

Similar News