దేశం చూపు.. ఇటు వైపు!

మరి కాసేపట్లో తెలంగాణలో రాజెవరో, తరాజెవరో తేలిపోతుంది. ఈ రోజు తెలంగాణతో పాటు, మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా తెలుస్తాయి. కాకపోతే దేశం చూపంతా తెలంగాణ ఫలితాలవైపే ఉంది. దక్షిణాదిలో తెలంగాణ కీలకమైన రాష్ట్రం. గత పదేళ్లుగా ప్రాంతీయ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ పట్టు కోసం కాంగ్రెస్‌, భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Update: 2023-12-03 03:00 GMT

దక్షిణాదిలో పాగా వేయడానికి భాజపా ఎన్నాళ్ల నుంచో చూస్తోంది. తాను తెలంగాణను స్వయంగా ఇచ్చింది కాబట్టి, తనను తెలంగాణ ప్రజలు గెలిపించాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. ఇక్కడ చోటు సంపాదించడం ద్వారా సౌత్‌ను పాలించాలని రెండు జాతీయ పార్టీల లక్ష్యం.

సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించారు కేసీయార్‌. పదేళ్ల తర్వాత ఆయనను తెలంగాణ వాసులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని కూడా దేశవాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ దశాబ్దం తర్వాత జరుగుతున్న ఎన్నికలు, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News