బాబుతో వెళుతున్నానని చెప్పేందుకే సభ : పవన్ పై నాని ఆగ్రహం

సినిమాపిచ్చితో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారిని నమ్మలేదని అనడమేంటని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Update: 2023-01-12 15:40 GMT

సినిమాపిచ్చితో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారిని నమ్మలేదని అనడమేంటని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఒళ్లుహూనం చేసుకి అంతదూరం వస్తే నట్టేట ముంచేస్తారని అనడం ఎంత వరకూ సబబని అన్నారు. వైసీపీ అంటే ద్వేషిస్తారని, చివరకు అభిమానులను కూడా నమ్మరని చెప్పడం ఏంటని అన్నారు. జగన్ అంటే ఎంత ద్వేషం, ఈర్ష్య, అసూయ ఎందుకన్నారు. అన్న పార్టీని వదిలేసి సొంత పార్టీ పెట్టుకుని అందరితో అంటకాగింది ఎవరన్నారు. మూడు ముక్కల రాజకీయ నేత ఎవరని పేర్ని నాని ప్రశ్నించారు. రాజకీయ వ్యభిచారం చేస్తుంది నువ్వు కాదా? అని నిలదీశారు.

పూటకో మాట....
పూటకోమాట, రోజుకో మాట మాట్లాడే పవన్ కల్యాణ్ బరితెగింపు రాజకయీాలు చేస్తున్నారన్నారు. ఒంటరిగా వెళ్లలేనని ఓటమిని పవన్ ముందే ఒప్పుకున్నాడని పేర్ని నాని అన్నారు. అనేక అబద్ధాల మధ్య పవన్ చెప్పిన నిజాలు ఇవేనని అన్నారు. తాను చంద్రబాబు చంకలో ఉన్నానని చెప్పడానికే ఈ మీటింగ్ కు పెట్టినట్లుందని ఎద్దేవా చేశారన్నారు. జగన్ అంటుంది దత్తపుత్రుడని, దానికే అంత కోపమా? అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కు ఉన్నది మామా అల్లుళ్ల బంధమా? అని అన్నారు. నోరురుంది కదా అని ఏది పడే మాట్లాడటమేనని అన్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడే పవన్ అని ఎద్దేవా చేశారు. రణస్థలంలో గిడుగు రామ్మూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడట అంటూ సెటైర్ వేశారు.
భయం లేదంటూనే...
రణస్థలం సభలో పదమూడు సార్లు భయంలేదని చెప్పాడని, పవన్ ఎంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. పవన్ కు వచ్చిన కష్టాలు పగోడికి కూడా వద్దన్నారు. 175 స్థానాల్లో పోట ీచేయనని నువ్వే చెబుతావు.. మరి ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేస్తావో చెప్పలేదన్నారు. ఆర్కెస్ట్రా లను తీసుకొచ్చి వాయించుకోవడం తన్ప ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. విడాకులిచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని యువతకు సందేశం ఇవ్వడానకే ఈ మీటింగ్ పెట్టావా? అని ప్రశ్నించారు. నీతో సెల్ఫీలు దిగే బుద్ధితక్కువ వైసీపీ నేతలు ఎవరుంటారన్నారు. నువ్వు స్క్రిప్ట్ లేకుండా ప్రసంగిస్తావా? అని ప్రశ్నించారు. ఇంతకీ ఈయన బీజేపీతో ఉంటాడా? టీడీపీతో ఉంటాడా? అని సెటైర్ వేశారు.
రోజా రెండు సార్లు గెలిచింది....
ఒక సినిమా మాజీ నటిని దిగజారి మాట్లాడతావా? అని పేర్ని నాని ప్రశ్నించారు. నీ తప్పుడు బుద్ధి బయట పెట్టుకున్నావన్నారు. రోజాగారు ఏం తప్పుడు పనిచేసిందని అన్నావన్నారు. నీ వయసెంత? నీపక్కన నటించే హీరోయిన్ల వయసెంత అని ప్రశ్నించారు. మహిళల గురించి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎలా అబ్బిందన్నారు. రోజా నేరుగా ప్రజల నుంచి గెలిచిందని, పదేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తుందన్నారు. సత్యానంద గారి వద్ద నటన కాదు, సంస్కారం నేర్చుకోమని పేర్ని నాని సలహా ఇచ్చారు. చంద్రబాబుతో వెళ్లిపోతానని నేరుగా చెప్పడానికే సభ పెట్టావని అన్నారు. నా చేతికి అందేట్లు వచ్చి మాట్లాడితే తాను కూడా చెబుతానని ఛాలెంజ్ విసిరారు.


Tags:    

Similar News