మనవడిగా మాట ఇస్తున్నా

అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రారంభించారు. కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 [more]

Update: 2019-10-10 08:06 GMT

అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రారంభించారు. కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని జగన్ చెప్పారు. తొలి దశలో ఈనెల 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారని, మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తారని, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తారని జగన్ వివరించారు.

జిల్లా రూపురేఖలను….

మా తల్లి విజయమ్మ ఈ జిల్లా ఆడపడుచేనని నేను మీ మనవడినంటూ జగన్ ప్రసంగించగానే సభలో హర్షద్వానాలు వెల్లువెత్తాయి. అనంతపురం జిల్లా రూపు రేఖలు మారుస్తానన్నారు జగన్. మీ జిల్లా సమస్యలన్నింటికి తోడుగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. మీ అందరితోడు, ఆశిస్సులు, మీ బిడ్డకు ఇవ్వండంటూ జగన్ చేతులెత్తి నమస్కరించారు. మీ చల్లని దీవనెలుంటే ఏదైనా సాధ్యమని విన్నవించారు ఏపీ సీఎం జగన్.

 

Tags:    

Similar News