నకిలీ ఏసీబీ పేరిట దందా.. గ్యాంగ్ సినిమా చూసి?

ఏపీలో నకిలీ ఏసీబీ అధికారుల దందా బయటపడింది. ‘గ్యాంగ్’ సినిమా చూసి నకిలీ ఏసీబీ అధికారుల అవతారం ఎత్తింది ఒక ముఠా. ఏపీలో మొత్తం 68 మంది [more]

Update: 2020-09-09 02:48 GMT

ఏపీలో నకిలీ ఏసీబీ అధికారుల దందా బయటపడింది. ‘గ్యాంగ్’ సినిమా చూసి నకిలీ ఏసీబీ అధికారుల అవతారం ఎత్తింది ఒక ముఠా. ఏపీలో మొత్తం 68 మంది అధికారులను ఈ ముఠా బెదిరించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ నకిలీ ఏసీబీ ముఠా బెదిరింపులకు దిగింది. అవినీతి అధికారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఇప్పటికే ఈ ముఠాను రెండుసార్లు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో 16 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ శ్రీనాథ్‌రెడ్డి ఈ ముఠాకు కీలక సూత్రధారి.

వీరిపై కేసు నమోదు…

జైల్లోకి వెళ్లి శ్రీనాథ్‌రెడ్డి ముఠా తయారుచేసుకున్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చి సూర్య ‘గ్యాంగ్’ మూవీ చూశాడు. 68 మంది అవినీతి అధికారుల లిస్ట్ సంపాదించి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏపీ వ్యాప్తంగా 13మంది అధికారుల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వీరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశారు.

Tags:    

Similar News