రేవంత్ రెడ్డి అక్రమాస్తులు, ఓటు కు కోట్లు వ్యవహారంలో నకిలీ అధికారులు సోదాలు జరిపి నగదు, బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపురి కాలనీలోని రణధీర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల పేరుతో సుమారు 15 మంది నిన్న సోదాలు జరిపారు. అనంతరం అక్కడ దొరికిన బంగారం, నగదును తమ వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది. అంతేకాదు, రణధీర్ రెడ్డిని కూడా తీసుకెళ్లారు.
సోదాలు జరిపిందెవరు..?
రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఉదయసింహా కు రణధీర్ రెడ్డి బంధువు. ఇవాళ రణధీర్ రెడ్డి బంధువులు ఆయన ఆచూకీ కోసం ఐటీ అధికారులను సంప్రదించగా.. అసలు తాము ఎటువంటి సోదాలు చేయలేదని స్పష్టం చేశారు. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో అసలు సోదాలు ఎవరు జరిపారు..? రణధీర్ ను ఎక్కడకు తీసుకెళ్లారనేది ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది.