వంద మంది పోలీసులు.. రోడ్డు మార్గం ద్వారా?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడానికి దాదాపు వందమంది పోలీసులు వచ్చారు. ఆయనను రోడ్డు మార్గం ద్వారా టెక్కలి నుంచి విజయవాడకు [more]

Update: 2020-06-12 03:16 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడానికి దాదాపు వందమంది పోలీసులు వచ్చారు. ఆయనను రోడ్డు మార్గం ద్వారా టెక్కలి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ చూపే అవకాశం ఉంది. టెక్కలి నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు ఏసీబీ అధికారులు సమాచారమిచ్చారు. రోడ్డు క్లియరెన్స్ కోసం వారు ముందు జాగ్రత్త చర్యగా అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం పంపారు. టెక్కలిలోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెక్కలిలో తన స్వగృహంలో నిద్రిస్తున్న అచ్చెన్నాయుడును పోలీసులు తలుపుతట్టి లేపి మరీ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తేరుకునే లోపే అచ్చెన్నాయుడును విజయవాడకు తరలించాలన్నది ఏసీబీ ఆలోచనగా ఉంది.

Tags:    

Similar News