వీరిద్దరికీ జగన్ అలా చెక్ పెడుతున్నారట

భీమవరం నియోజకవర్గంలో వారికి పదవులు ఇస్తుండటం ఏపీలో హూజారాబాద్ ఉప ఎన్నిక టాక్ ఆఫ్ ది పార్టీగా మారింది.

Update: 2021-12-01 02:04 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మందికి పదవులు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి అనేక మంది నేతలకు కండువా కప్పేశారు. అయినా అక్కడ టీఆర్ఎస్ కు విజయం లభించలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ కు ఇబ్బంది కలిగి ఉండవచ్చు కాని, ఎంతో మంది నేతలకు పదవులు దక్కేలా చేసింది. అయినా అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరలేదు. ఇప్పుడు జగన్ కూడా హుజూరాబాద్ లా ఏపీలో మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లే కనపడుతుంది.

పదవులున్నీ వారికే...
భీమవరం నియోజకవర్గంలో వారికి పదవులు ఇస్తుండటం ఏపీలో హూజారాబాద్ ఉప ఎన్నిక టాక్ ఆఫ్ ది పార్టీగా మారింది. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో అనేక మందికి పదవులు జగన్ ఇచ్చారు. దీనికి కారణాలు ఇక్కడ రెండు కన్పిస్తున్నాయి. ఒకటి మరోసారి అక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటం, మరో కారణం వచ్చే ఎంపీ ఎన్నికల్లో రఘురామ కృష్ణ రాజును ఓడించాల్సి ఉండటం.
ఓటు బ్యాంకును....
ఈ రెండు కారణాలతోనే అక్కడి నేతలకు జగన్ ప్రయారిటీ ఇస్తున్నారంటున్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లోనే క్షత్రియ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. అదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం కూడా బలంగా ఉంది. ఇక్కడ పవన్ కల్యాణ్ , రఘురామ కృష్ణరాజును వచ్చే ఎన్నికల్లో నిలువరించాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు క్షత్రియ సామాజికవర్గాన్ని కూడా ఆకట్టుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లే కనపడుతుంది.
పదవులిచ్చినా..?
ఇప్పటికే భీమవరం నియోజకవర్గానికి చెందిన మోషేన్ రాజును శాసనమండలి ఛైర్మన్ గా నియమించారు. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా పాతపాటి సర్రాజును, జడ్పీ ఛైర్మన్ గా కవురు శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ గా పీవీఎల్ నరసింహరాజు, డీఎస్ఎంఎస్ ఛై్మగా వెంకటస్వామి లను జగన్ నియమించడం వెనక వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, రఘురామ కృష్ణరాజుకు చెక్ పెట్టడానికేనంటున్నారు. దీంతో పాటు గ్రంధి శ్రీనివాస్ కు కూడా మంత్రి వర్గంలో స్థానం దొరికే అవకాశముందని చెబుతున్నారు. మరి భీమవరం మరో హుజూరాబాద్ లా మారదన్న గ్యారంటీ ఏమీలేదన్న కామెంట్స్ వైసీపీ నుంచే విన్పిస్తున్నాయి.



Tags:    

Similar News