రేపటి నుంచి అక్కడ కూడా కర్ఫ్యూ

కరోనా కేసులు పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర‌్ణయం తీసుకుంది. రేపటి నుంచి గోవాలో కర్ఫ్యూ అమలు కానుంది. మొత్తం 15 రోజుల పాటు గోవాలో కర్ఫ్యూ [more]

Update: 2021-05-08 01:21 GMT

కరోనా కేసులు పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర‌్ణయం తీసుకుంది. రేపటి నుంచి గోవాలో కర్ఫ్యూ అమలు కానుంది. మొత్తం 15 రోజుల పాటు గోవాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ సమయంలో నిత్యావసర వస్తువలు దుకాణాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే అనుమతిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. కేవలం 25 శాతం మంది ప్రజలే బయటకు రావాలని ఆయన కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఖచ్చితంగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకు రావాలని ఆయన ెప్పారు. కనీసం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయినా చూపించాలని ఆయన కోరారు. కర్ఫ్యూ సమయంలో వివాహాలను రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News