ఎవరినీ వదిలపెట్టం… పోలీసులకు అంటగట్టవద్దు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు [more]

Update: 2020-03-14 03:18 GMT

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా వారిమీద చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఈ అంశంపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేయవద్దని, రాజకీయ ఆరోపణల్లోకి పోలీసులను లాగవద్దని పార్టీలకు, నాయకులకు గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీ వారు ఫిర్యాదు ఇచ్చినా తీసుకుంటున్నామని, ఆ ఫిర్యాదుల మీద తక్షణం విచారణ జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.

మాచర్ల ఘటనపై…..

ప్రత్యేకించి మాచర్ల సంఘటనపైన చట్టపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈకేసులో ఎవరికీ అనుకూలంగా తాము వ్యవహరించలేదన్నారు. అలాంటి పక్షపాతానికి తావులేదు. సెక్షన్‌ 307 కింద మేం కేసులు నమోదు చేయలేదని, వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు. మాచర్ల ఘటనలో 307 సెక్షన్‌ కింద ఇప్పటికి ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వీరుముగ్గురూ ఇప్పుడు గురజాల సబ్‌జైల్లో ఉన్నారని తెలిపారు. కాబట్టి పోలీసుల పాత్రమీద విమర్శలు చేసేవారు బోండా ఉమ, బుద్దా వెంకన్నలను పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని వారికి భద్రత కల్పించామన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నామన్నారు. అంతేకాక ప్రతిరోజూ రాష్ట్రంలోని అధికార పార్టీనాయకులైనా, ప్రతిపక్ష నాయకులైనా వారికి ఏపీ పోలీసులు పూర్తి రక్షణ, భద్రత కల్పిస్తున్న విషయాన్ని మరోసారి ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నామని గౌతం సవాంగ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News