వారికి డీజీపీ ప్రత్యేక అభినందన

పోలీస్ శాఖ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతున్న పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు.విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటాం అని మరో సారి రుజువు [more]

Update: 2021-03-28 06:16 GMT

పోలీస్ శాఖ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతున్న పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు.విధి నిర్వహణలోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటాం అని మరో సారి రుజువు చేసిన రాంబిల్లి పోలీసులను డీజీపీ ప్రశంసించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహన్ని మూడు కిలోమీటర్లు తమ భుజాలపై మోసుకుని తీసుకువచ్చి మానవత్వం చాటిన రాంబిల్లి పోలీసులను యావత్ భారతం ప్రశంసలతో ముంచెత్తుతోంది. వారి సేవా తత్పరతకు జేజేలు పలుకుతోంది. రాంబిల్లి మండల పరిధిలోని సీత పాలెం సముద్ర తీరాన మూడు రోజులుగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవం గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం అందినా, కుళ్ళి పోయి, దగ్గరకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న శవాన్ని తరలించడానికి అక్కడి గ్రామస్తులు సైతం ముందుకు రాలేదు. రాంబిల్లి ఎస్ఐ, ఏఎస్ఐ దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు మరియు హోంగార్డ్ కొండబాబులు ఆ మృత దేహాన్ని తమ భుజాలపై మోసుకు వచ్చి ఎలమంచిలి మార్చురీకి తరలించారు. మానవత్వం మూర్తీభవించేలా పోలీసు ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన వారిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:    

Similar News