ఐటీ లూటీ బండారాన్ని బయటపెడతాం

Update: 2018-10-02 12:46 GMT

ఏపీ సర్కార్ పై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు నారాలోకేష్ నిర్వహిస్తున్న ఐటీ శాఖలో జరుగుతున్న అవకతవకలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో ఏపీలో దోపిడీ జరుగుతుందన్నారు. ఐటీ కంపెనీల మాటున కోట్లాది రూపాయల కుంభకోణం దాగి ఉందన్నారు. ఇన్సెంటవ్ ల పేరుతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు లూటీ చేశారన్నారు. ఐటీ కంపెనీలు ఏపీకి ఎన్ని వచ్చాయి? వాటికి ఏ రాయితీలు ఇచ్చారు? ప్రోత్సహకాలు ఎంత? అనే వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా ప్రభుత్వం ఇవ్వడం లేదని జీవీఎల్ ఆరోపించారు. వీటిపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ కంపెనీలకు అతి తక్కువ ధరలకు భూ కేటాయింపులు చేశారని ఆయన ఆరోపించారు. త్వరలోనే బండారాన్ని బయటపెడతామని జీవీఎల్ చెప్పారు.

Similar News