హైఅలెర్ట్: విమానాశ్రయాలు మూసివేత..!
భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చి బాంబులు వేసింది. భారత బలగాలు [more]
భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చి బాంబులు వేసింది. భారత బలగాలు [more]
భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చి బాంబులు వేసింది. భారత బలగాలు తిప్పికొట్టడంతో పాక్ కు చెందిన ఒక ఎఫ్ – 16 యుద్ధ విమానం కుప్పకూలింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత్ హైఅలెర్ట్ ప్రకటించింది. పలు విమానాల రాకపోకలను భారత్ నిలిపివేసింది. జమ్ము, లేహ్, అమృత్ సర్, శ్రీనగర్, చండీగఢ్, పఠాన్ కోట్ లలో భారత్ హైఅలెర్ట్ ప్రకటించింది.
అంతా సిద్ధంగా….
ఎయిర్ బేస్ లలో యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. ఇక, పాకిస్తాన్ కూడా పలు విమానాశ్రయాలను మూసేసింది. పాక్ లోని లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియాన్ కోట్, ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టులను పాక్ మూసేసింది. సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షిస్తున్నారు. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భద్రతా సలహాదారు అజీత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దుల్లోని పరిస్థితిని మోదీకి అజీత్ దోవల్ వివరిస్తున్నారు.