సకల జనుల సభకు ఓకేనన్న కోర్టు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరూర్ నగర్ లో ఈ నెల 30న సభ నిర్వహించుకునేందుకు ఆర్టీసీ జేఏసీ [more]

Update: 2019-10-29 11:24 GMT

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరూర్ నగర్ లో ఈ నెల 30న సభ నిర్వహించుకునేందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అనుమతిని కోరడంతో కలెక్టర్ అనుమతికి నిరాకరించారు. దీంతో ఆర్టీసీ ఐకాస నేతలు హకోర్టును ఆశ్రయించారు.సభ నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వకూడదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వానికి కొంత సమయాన్ని కూడా కోర్టు ఇచ్చింది. చివరికి సరూర్ నగర్లో సభ జరుపుకోవడానికి హైకోర్టు అనుమతించింది.

 

Tags:    

Similar News