వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు సిట్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగడం లేదని, [more]
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు సిట్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగడం లేదని, [more]
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు సిట్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగడం లేదని, విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని, కావున సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని సంస్థతో విచారణ జరిపించాలని వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, వైసీపీ అధినేత జగన్ వేర్వేరు పిటీషన్లు వేశారు. ఈ పిటీషన్లను విచారించిన కోర్టు ఎన్నికలు ముగిసే వరకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించవద్దని, మీడియా సమావేశాలు పెట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ సీల్డ్ కవర్ లో కేసు దర్యాప్తు వివరాలను సిట్ హైకోర్టుకు సమర్పించనుంది.