ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిర్ పోర్టులో లేదా ఎయిర్ క్రాఫ్ట్ లో ఎటువంటి నేరం జరిగినా ఎన్ఐఏ విచారణ జరపాలనే నిబంధన ప్రకారం ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని జగన్ తో పాటు పలువురు పిటీషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాల్సిందిగా కోర్టు గత విచారణలో కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్ర నివేదికపై అసంతృప్తి.....
దీంతో కేంద్ర హోంశాఖ ఇవాళ కోర్టుకు నివేదిక ఆందజేసింది. ఈ నివేదిక చూసిన న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును విచారణను కేంద్రమే ఎన్ఐఏకి అప్పగిస్తుందా లేదా అనేది ఈ నెల 21 నాటికి స్పష్టంగా చెప్పాలని కోర్టు కేంద్ర హోంశాఖకు ఆదేశించింది. కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.