ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనను విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.90ని కోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని, పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ సర్పంచ్ ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీరాజ్ మంత్రిగా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఉన్నారు. దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు జరపాలని ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి ినిర్ణయం తీసుకుంటారో చూడాలి.