ఆ వ్యాపారులకు షాకిచ్చిన ఈడీ
బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారులకు ఈడి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న బంగారం గోల్డ్ బిజినెస్ మేన్ లకు సంబంధించిన ఆస్తులను ఎన్ [more]
బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారులకు ఈడి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న బంగారం గోల్డ్ బిజినెస్ మేన్ లకు సంబంధించిన ఆస్తులను ఎన్ [more]
బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారులకు ఈడి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న బంగారం గోల్డ్ బిజినెస్ మేన్ లకు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. పెద్ద మొత్తంలో బంగారం తో పాటు విల్లాలను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోల్ కత్తా లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి బంగారం కొనుగోలు చేసి దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బంగారాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి స్మగ్లింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మార్చి నెలలో హైదరాబాద్ వ్యాపారవేత్త పైన కేసు నమోదయింది . ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు హైదరాబాద్ లోని మొత్తం ఆరుగురు బంగారం వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. బంగారం వ్యాపారుల పై ఈడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 54 కిలోల బంగారంతో పాటు హైదరాబాద్లో ఉన్న విల్లాలను అటాచ్ చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్‌కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్‌కతా ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. కోల్‌కతా డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే ప్రీతం కుమార్ అగర్వాల్‌ను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపారు.