లాక్ డౌన్ పట్టించుకోకుండా… హంగామా చేస్తే?
లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి హంగామా చేస్తున్న వారి పైన పోలీసులు కఠినంగా [more]
లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి హంగామా చేస్తున్న వారి పైన పోలీసులు కఠినంగా [more]
లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి హంగామా చేస్తున్న వారి పైన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా వాహనాల తోపాటుగా వ్యక్తుల పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో వాహనాల తోపాటుగా వ్యక్తుల పైన కేసులు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మార్చ్ 28వ తేదీ నుండి 30 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన 29640 మందిని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. వీరందిరిపై వయోలేషన్ ఆక్ట్ కింద ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన 7845 మంది వాహనదారులపై సైతం కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటుగా మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఎవరైనా బయటికి వెళితే వారిపైన కూడా కేసు నమోదు చేస్తున్నారు.