పుల్వామా ఘటనపై స్పందించిన ఇమ్రాన్

పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, భారత్ అనవసరంగా తమను నిందిస్తుందని ఆరోపించారు. భారత్ లో [more]

Update: 2019-02-19 08:50 GMT

పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, భారత్ అనవసరంగా తమను నిందిస్తుందని ఆరోపించారు. భారత్ లో ఉగ్రవాద దాడి జరిగితే పాకిస్థాన్ కు ఏం లాభమని ప్రశ్నించారు. తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రదాడిపై విచారణకు భారత్ కు పాకిస్థాన్ పూర్తిగా సహకరిస్తుందని, ఆధారాలు ఉంటే భారత్ చూపించాలని ఆయన అన్నారు. ఎన్నికల ఏడాది కాబట్టి భారత రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ తమపై దాడికి దిగితే తాము కూడా దీటుగా బదులిస్తామని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News