దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు

తమిళనాడులో ఎన్నికల వేళ పొత్తులు కుదురుతున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో ఎంఐఎం కలసి పోటీ చేయాలని నిర్ణయించింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మ [more]

Update: 2021-03-09 01:16 GMT

తమిళనాడులో ఎన్నికల వేళ పొత్తులు కుదురుతున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో ఎంఐఎం కలసి పోటీ చేయాలని నిర్ణయించింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఒంటరిగా పోటీ చేస్తామన దినకరన్ ప్రకటించారు. కమల్ హాసన్ కూటమిలో చేరడానికి ప్రయత్నించారు. అయితే కమల్ హాసన్ అందుకు అంగీకరించకపోవడంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలని దినకరన్ డిసైడ్ అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో 20 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News