టీడీపీ యాత్రకు నో పర్మిషన్

తిరుపతిలో టీడీపీ తలపెట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసులు నిరాకరించారు. కేవలం ర్యాలీకి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు [more]

Update: 2021-01-21 06:02 GMT

తిరుపతిలో టీడీపీ తలపెట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసులు నిరాకరించారు. కేవలం ర్యాలీకి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులపై అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము అనుమతి అడిగినా ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. తిరుపతిలో తాము యాత్ర ప్రారంభిస్తే వైసీీప పతనం ప్రారంభమవుతుందని భావించి ప్రభుత్వం అడ్డుకుంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. పోలీసులు అడ్డుకున్నా తమ యాత్ర ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News