Hetero : ఎక్కడపట్టినా కరెన్సీ కట్టలే.. విస్తుపోయే నిజాలు
హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు ఆరు రోజుల పాటు కొనసాగాయి. దాదాపు 157 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. బీరువాల్లో కుక్కిన [more]
హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు ఆరు రోజుల పాటు కొనసాగాయి. దాదాపు 157 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. బీరువాల్లో కుక్కిన [more]
హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు ఆరు రోజుల పాటు కొనసాగాయి. దాదాపు 157 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. బీరువాల్లో కుక్కిన కరెన్సీ కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరోనా సమయంలో విదేశాలకు ఎగుమతి చేసిన ఔషధాల ద్వారా వచ్చిన ఆదాయంతో కంపెనీ పేరిట అనేక స్థలాలను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. దీంతో పాటు చిన్న ిచిన్న అపార్ట్ మెంట్లను కొనుగోలు చేసి వాటిలో మందులతో పాటు నగదు నిల్వలను కూడా ఉంచినట్లు గుర్తించారు.
లాకర్లలో 30 కోట్ల నగదు సీజ్….
16 ప్రయివేటు లాకర్లను కూడా అధికారులు తెరిచారు. ఒక్కొక్క లాకర్ లో రెండు కోట్ల నగదు ఉన్నట్లు తెలిసింది. లాకర్లలో మొత్తం 30 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 550 కోట్ల అనుమానిత లావాదేవీల పై ఆరా తీస్తున్నారు. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని హెటిరో యాజమాన్యానికి అధికారులు నోటిసులు జారీ చేశారు.