JN.1 variant: 225 రోజుల గరిష్ఠానికి.. కరోనా కేసులు!
దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 743 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య వ్యవహారాల శాఖ ప్రకటించింది. 225 రోజుల తర్వాత ఇదే అత్యధికం. గత 24 గంటల్లో ఈ వ్యాధితో ఏడుగురు మరణించారు.
దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 743 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య వ్యవహారాల శాఖ ప్రకటించింది. 225 రోజుల తర్వాత ఇదే అత్యధికం. గత 24 గంటల్లో ఈ వ్యాధితో ఏడుగురు మరణించారు. కేరళ వాసులు ముగ్గురు, కర్నాటక నుంచి ఇద్దరు, చత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి ఒక్కరు చొప్పున కొవిడ్ 19తో మృతి చెందినట్లు కేంద్రం అధికారికంగా వెల్లడిరచింది.
కేంద్ర అధికారిక లెక్కల ప్రకారం... 2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4,50,12,484 కరోనా సోకిందని, 5,33,358 మరణించారు. కొత్త కరోనా వేరియంట్ జెఎన్.1, వేగంగా వ్యాపించడం.. ప్రపంచవ్యాప్తంగా జనాన్ని కలవరపెడుతోంది. ఈ కొత్త వేరియంట్‌కు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీనివల్ల ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు ఉండదని నిపుణులు కూడా చెబుతున్నారు. అయినా మాస్కులు ధరించడం, సమూహాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.