తిరుగులేని టీం ఇండియా
భారత్ మూడో టీ 20లో విజయాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ గెలిచింది
పరాయి గడ్డపై టీం ఇండియా టీ 20 సిరీస్ ను కూడా కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళుతుంది. రెండో టీ 20లో పోరాడి ఓడిన భారత్ మూడో టీ 20లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ మూడు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ ఉంచిన లక్ష్యాన్ని ఛేదించారు. టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరవై ఓవర్లలో వెస్టిండీస్ 164 పరుగులు చేసింది. వెస్టిండీస్ లో మేయర్స్ 73 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. చివరి రెండు ఓవర్లలో హిట్ మేయర్, పావెల్ కూడా రాణించడంతో 164 పరుగులు చేసింది.
మూడు వికెట్ల తేడాతో...
165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా కేవంల మూడు వికెట్ల తేడాతోనే విజయం సాధించింది. సూర్యకుయామర్ యాదవ్ 72 పరుగులు చేశారు. అందులో నాలుగు సిక్స్ లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 24, రిషబ్ బంత్ 33, దీపక్ హుడా 10 పరుగులు చేసి భారత్ ను విజయం వైపు మళ్లించాడు. సూర్యకుమార్ యాదవ్ అవుటవ్వగానే స్కోరు వేగం తగ్గినా అప్పటికే భారత్ విజయం ఖాయమయిపోయింది. మొత్తం ఐదు టీ ౨౦లను ఆడాల్సి ఉండగా ఇప్పటికే రెండింటిని టీం ఇండియా గెలుచుకుంది