చివరి బంతితో గెలుపు.. అదెలాగంటే?

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై భారత్ తొలి టీ 20 మ్యాచ్ గెలిచింది. చివర వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఇండియాదే గెలిచింది

Update: 2023-01-04 02:27 GMT

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై భారత్ తొలి టీ 20 మ్యాచ్ గెలిచింది. చివర వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఇండియాదే పైచేయి అయింది. మూడు టీ 20 సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. భారత్ బ్యాటర్లు విఫలమయినా, బ్యాటర్లు రాణించడంతో ఈ విజయం సాధ్యమయింది. తొలిసారి క్యాప్ దశరించిన శివమ్ బావి శ్రీలంక బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. నాలుగు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీశాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ను ఎందచుకుంది. ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్ భారత్ చేజారిపోయిందనుకున్న తరుణంలో చివరి ఓవర్ చివరి బాల్ భారత్ ను గెలిపించింది.

భారత్ బ్యాటర్లు విఫలం...
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇషాన్, హుడా, అక్షర్ పటేల్ తప్పించి ఎవరూ క్రీజులో పెద్దగా నిలబడలేకపోయారు. 15 ఓవర్లకు వంద పరుగులు దాటింది. అంత చెత్త బ్యాటింగ్ చేశారు. దీంతో తక్కువ స్కోరుకే అవుట్ అవుతారని అందరూ భావించారు. కానీ చివర్లో హుడా, అక్షర్ పటేల్ లు సిక్సర్లు, ఫోర్లను మోది ఐదు ఓవర్లలో 61 పరుగులు చేశారు. దీంతో భారత్ 162 పరుగులు చేసింది. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లు ఏడు పరుగులకు అవుటయ్యారు. హార్థిక్ పాండ్యా 29 పరుగులు చేసి వెనుదిరగడంతో భారత్ అభిమానుల్లో నిరాశ ఆవరించింది. డెత్ ఓవర్లలో హుడా, అక్షరపటేల్ విజృంభించి ఆడి స్కోరును 162 పరుగులు దాటించి భారత్ పరువు కాపాడారు.
ఒక బంతి.. నాలుగు పరుగులు...
అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు ఆది నుంచి తడబడతూనే ఉంది. 163 పరుగులు టార్గెట్ గా బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లలో శివమ్ మావి నిస్సాంక, ధనంజయను వరసగా అవుట్ చేశాడు. దీంతో కొంత భారత్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే హసరంగ సిక్సర్లు బాదడం, షనక కూడా నిలకడగా ఉండటంతో శ్రీలంక విజయం ఖాయమనుకున్నారు. కానీ 45 పరుగులు చేసిని షనకను ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ భారత్ వైపు టర్న్ అయింది. అయితే కరుణరత్నే నిలదొక్కుకుని ఆడుతుండటంతో మళ్లీ టెన్షన్ మొదలయింది. చివరి బంతి అక్షర్ కు ఇచ్చాడు. ఒకటి సిక్సర్ కొట్టాడు. 13 పరుగులు మాత్రమే అప్పటికి శ్రీలంకకు అవసరమయ్యాయి. సిక్సర్ కొట్టడంతో ఏడు పరుగులకు చేరింది. అయితే చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా కరుణరత్నే ఆడిన చివరిషాట్ పేలవంగా మారడంతో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు


Tags:    

Similar News