రాజకీయాల్లోకి క్రికెటర్..?

Update: 2018-08-18 12:47 GMT

రాజకీయాల్లోకి క్రికెటర్లు రావడం కొత్తేమీ కాదు. అజారుద్దిన్, మహ్మద్ కైఫ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి క్రికెటర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మనవద్దే కాదు, పాకిస్తాన్ లోనూ ఇవాళ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసింది. అయితే, భారత జట్టులో కీలక ఆటగాడిగా అనేక మరుపురాని విజయాలను అందించిన గౌతమ్ గంభీర్ చూపు ఇప్పుడు రాజకీయాల వైపు మళ్లిందని తెలుస్తోంది. ఆయనను పార్టీలో చేర్చుకుని పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయించాలని బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందంట. ఈ విషయాన్ని ఓ బీజేపీ నేత కూడా ధృవీకరించారు. గంభీర్ చివరగా 2013లో వన్డే మ్యాచ్, గత సంవత్సరం రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ఆడాడు.

Similar News