Gold Price Today : బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి.. వెండి ధరలు మాత్రం శాంతించాయి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గిపోయాయి
బంగారం ధరలు నిన్నటి వరకూ తగ్గుతూ ఉన్నాయి. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు, మదుపరులకు కొంత ఊరటనిచ్చింది. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో పసిడి ధరలు అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు. కానీ అది బంగారం. ఒక్కసారి షాక్ ఇచ్చేస్తుంది. అందుకే ధరలను తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంకా తగ్గుదల ఉంటుందని వెయిట్ చేస్తే పెరుగుతాయని ముందే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నా పెద్దగా పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేయలేదు. దీనికి కారణం బంగారం కొనుగోళ్లు తగ్గడంతో ధరలు తగ్గుతాయని వారు వేసుకున్న అంచనా తప్పే అయింది.
బంగారాన్ని దాచుకుంటే...
ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారాన్నిఎక్కువగా వినియోగిస్తారు. బంగారం అంటే అదొరకమైన అనుభూతితో ఫీలవుతారు. తమ వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత తమ బతుకు భద్రమని భావించే వారు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. కష్టకాలంలో పసిడి తమను సులువుగా ఆదుకుంటుందని భావించడమే ఇందుకు ప్రధాన కారణం. తాకట్టు పెట్టైనా తమ అవసరాలకు డబ్బు తెచ్చుకోవడానికి బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది. తమ అవసరాలు తీరాక, డబ్బులు సమకూరాక, తిరగి బంగారాన్ని బ్యాంకుల నుంచి విడిపించుకోవచ్చు. బంగారాన్ని కుదువ పెట్టుకుంటే వడ్డీ కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది గోల్డ్ కొనుగోళ్లపైనే ఆసక్తి కనపరుస్తుంటారు.
వెండి తగ్గి కొంత...
అందుకే బంగారానికి భారత దేశంలో ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అయితే ఇటీవల కాలంలో మాత్రం భారీగా ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. వ్యాపారులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. సీజన్ లోనే ఇలా వ్యాపారాలు సాగితే ఎలా అని వారు మదనపడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గిపోయాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు రోజుల్లో 280 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కిలోపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,060 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,520 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 97,800 రూపాయలుగా నమోదయింది.