జగన్ అనే…. నేను మీకు అండగా ఉంటా
గాంధీజీ పోరాటాన్ని ప్రపంచ దేశాలు మరిచిపోలేవని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామసచివాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. [more]
గాంధీజీ పోరాటాన్ని ప్రపంచ దేశాలు మరిచిపోలేవని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామసచివాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. [more]
గాంధీజీ పోరాటాన్ని ప్రపంచ దేశాలు మరిచిపోలేవని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామసచివాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రతి గ్రామానికి 12 మందికి ఉద్యోగాలిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ స్పూర్తితోనే ఏపీలో గ్రామ సచివాలయాలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత ఏ దేశంలోనూ ఉండదేమోనని జగన్ సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలనను ప్రతి ఇంటికి తీసుకువెళ్లడమే తమలక్ష్యమన్నారు. 35 శాఖలకు సంబంధించిన 500 సేవలను గ్రామసచివాలయంలో అందిస్తారన్నారు. తాను చేసిన వేలకిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూశానని వాటిని పరిష్కరించాలనే దిశగానే అడుగులు వేస్తున్నట్లు జగన్ చెప్పారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది…
నాణ్యమైన ఎరువులు, విత్తనాలకోసం ప్రత్యేక దుకాణాలను తీసుకువస్తామన్నారు జగన్. ప్రతి ప్రభుత్వ పథకం మన ఇంటికే వస్తుంది, తలుపులు తట్టి డోర్ డెలివరీ చేస్తారు ఎవరూ కూడా కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగక్కరలేదని ప్రతి పేద ఇంటికి ప్రభుత్వ పథకాలు అందడమే తమ సర్కారు ధ్యేయమని చెప్పారు జగన్. రెండు నెలల్లో పూర్తిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు జరుగుతుందన్నారు. జనవరి 1న కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు 72 గంటల్లోనే ఇచ్చేలా చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఉత్తమ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తామని, ఈ వ్యవస్థలో గత ప్రభుత్వంలో చూసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరుగకూడదనే గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మార్చేస్తామన్నారు. జగన్ అని నేను ప్రజలకు అండగా ఉంటానన్నారు ఏపీ సీఎం జగన్.