ప్రమాణస్వీకారానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారణ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఎల్లుండి విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా [more]

Update: 2019-05-28 13:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారణ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఎల్లుండి విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను సైతం వైసీపీ ఆహ్వానించింది. వామపక్షాల నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరి, మధు, రామకృష్ణను సైతం వైసీపీ జగన్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జగన్ ఫోన్ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News