వైసీపీ ప్రభుత్వ Plan B రెడీ.. ?? చంద్రబాబు కేసులో కీలక మలుపు
చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూత్రా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.
చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూత్రా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.
కోర్టు రిమాండ్‌ను తిరస్కరించినా లేదా బెయిల్ మంజూరు చేసినా పుంగనూరు పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉంది.?
ఇటీవలి పర్యటనలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో పుంగనూరు పోలీసులు చంద్రబాబు ఏ-1గా పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబుకు కోర్టులోనే వైద్య పరీక్షల ఏర్పాట్లు..సిట్ కార్యాలయం నుంచి నేరుగా 3వ అదనపు జడ్జ్ కోర్టుకు చంద్రబాబు....
కోర్టులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యులు... అంబులెన్స్ లో వైద్య పరీక్షల పరికరాలు తీసుకువచ్చిన వైద్యులు.
మూడో అదనపు జిల్లా జడ్జి, ప్రత్యేక ఏసీబీ కోర్టు మేజిస్ట్రేట్ హిమ బిందు ఇంటికి బయలుదేరారు.
గరికపాడు చెక్పోస్ట్ ఉద్రిక్తత వద్ద వాతావరణం..
పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రా తెలంగాణా సరిహద్దుకు చేరుకున్నారు.
జగ్గయ్యపేట సమీపంలో పవన్ కళ్యాణ్ కారును పోలీసులు అడ్డుకున్నారు.
నడచి మంగళగిరి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం
అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో.. వాహనం దిగి నడక మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర బోర్డర్ గరికపాడు వద్ద కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్.