బ్రేకింగ్: ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం.. దీని ప్రత్యేకత ఏమిటి?
ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని చేపట్టి విజయవంతం చేసింది. సూర్యుని రహస్యాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్1..
➦ సూర్యుని రహస్యాలను గుట్టు విప్పనున్న ఆదిత్య ఎల్-1
➦ తొలిసారిగా సూర్యుని వద్దకు సోలార్ మిషన్
➦ ఆదిత్య ఎల్1 ప్రత్యేకత ఏమిటి?
➦ ఆదిత్య ఎల్ 1 చేరేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుంది?
ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని చేపట్టి విజయవంతం చేసింది. సూర్యుని రహస్యాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్1 15 లక్షల కిలోమీర్ల దూరం ప్రయాణించనుంది. ఆదిత్య ఎల్1 ను పీఎస్ఎ ల్వీ సి57 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఇక్కడి నుంచే తన పరిశోధన కొనసాగించనుంది ఆదిత్య. ఇప్పటికే చంద్రయాన్ 3ని విజయవంతం చేసిన ఇస్రో.. ఇప్పుడు సూర్యున్ని టార్గెట్ చేసింది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టింది. శనివారం ఉదయం 11.50 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది ఆదిత్య ఎల్1. రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి విజయవంతం చేసింది. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో చేపట్టింది. ఈ ఆదిత్య L1 మిషన్ ద్వారా.. సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో సిద్ధమైంది. సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు.. సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఈ ప్రయోగం చేస్తోంది.
తొలిసారిగా సోలార్ మిషన్:
కాగా, భారతదేశం తొలి సోలార్ మిషన్‌ను గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. సూర్యుని రహస్యాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టామని అన్నారు. ఇప్పుడు ఆదిత్య ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపింది. భారత్‌కు పొరుగు దేశం చైనా కూడా సోలార్ మిషన్‌ను ప్రారంభించింది. చైనా ఉపగ్రహం సూర్యుని అయస్కాంత క్షేత్రం, సౌరుడి వేడి, కరోనల్ మాస్ ఎజెక్షన్‌కు సంబంధించిన 500GB డేటాను ప్రతిరోజూ భూమికి పంపుతుంది. అయితే చైనా వ్యోమనౌక భూకక్ష్యలో ఉండి తన విధులను నిర్వహిస్తుండగా.. ఇస్రో ప్రయోగిస్తున్న సూర్యుడి కక్షలోకి వెళ్లనుంది.. అంటే మన ఆదిత్య చైనా చేయని పనిని చేయబోతోంది. అయితే భారతదేశం ఆదిత్య L-1కు చైనా సోలార్ మిషన్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటుంది. చైనాకు చెందిన మిషన్ కౌపు బరువు 1859 కిలోలు. ఇదే భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్-1400 కేజీలు. అయితే ఈ ఆదిత్య ఎల్ 1 కాలపరిమితి 5 సంవత్సరాలు. అయితే ఇది నింగిలోకి వెళ్లిన 4 నెలల నుంచి తన పరిశోధనను మొదలు పెడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తులు. అంతరిక్షంలో మరో విజయానికి ఆరంభమైందనే చెప్పాలి. చంద్రయాన్ తర్వాత సూర్యయాన్ చేపట్టి మరో చరిత్ర సృష్టించనుంది ఇస్రో.
భూమికి- సూర్యునికి ఎన్నికిలోమీటర్లు..
భూమికి సూర్యునికి 15 కోట్ల కిలోమీట్లు. అయితే ఆదిత్య ఎల్ 1 అనేది 125 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడి నుంచి సూర్యునిపై పరిశోధన ప్రారంభిస్తుంది.అయతిఏ 15 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుని పొరను అధ్యయనం చేయుంది ఆదిత్య.
ఆదిత్య-ఎల్1 మిషన్ ఖర్చు ఎంతో తెలుసా.?
ఇస్రో చేపడుతున్న ఈ ఆదిత్య ఎల్1 కోసం తక్కువ ఖర్చులోనే ప్రయోగం చేపడుతోంది. దీని ఖర్చు కేవలం 378 కోట్ల రూపాయలు. అయితే ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా కూడా చేపట్టింది. దాని ఖర్చుకంటే 97 శాతం తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం 12,300 కోట్ల రూపాయలను నాసా ఖర్చు పెట్టింది. అయితే ఇస్రో ప్రయోగాలన్నీ తక్కువ ఖర్చుతో చేస్తున్నవే. ఇటీవలే విజయవంతమైన చంద్రయాన్-3కి రూ600 కోట్లు కాగా, ఆదిత్య L1 కోసం 200 కోట్ల రూపాయలు తక్కువ చేశారు.
ఇప్పటివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ మాత్రమే సూర్యుని అధ్యయనం కోసం విడివిడిగా, ఉమ్మడిగా అంతరిక్ష యాత్రలను పంపాయి. ఇందులో అతిపెద్ద మైలురాయి నాసా కు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ అని నిరూపించబడింది. ఇది సూర్యుడికి దగ్గరగా ఉన్న ఏకైక అంతరిక్ష నౌక. డిసెంబర్ 14, 2021లో ఈ ప్రయోగం చేపట్టింది నాసా. NASA ఈ విజయాన్ని సాధించడానికి 60 సంవత్సరాలకు పైగా పట్టింది. అయితే భారతదేశం కేవలం 15 సంవత్సరాలలో తన సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. భూమి సహా ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లే.. సూర్యుడు కూడా పాలపుంత మధ్యలో తిరుగుతాడు. అటువంటి పరిస్థితిలో.. సూర్యుని రహస్యాలను తెలుసుకోవడం ద్వారా విశ్వానికి కి చెందిన సత్యాన్ని కనుగొనవచ్చు.
దేశ ప్రధాని నేతృత్వంలో ఇస్రో నిరంతరం పని చేస్తోందని.. ప్రధాని మోడీ దేశంలోని శాస్త్రవేత్తలకు ప్రయోగాలు చేసేందుకు స్వేచ్ఛనిచ్చిన కారణంగా ఇస్రో నిరంతరం తమ పని చేస్తూ సగర్వంగా విజయాలను నమోదు చేస్తుదనని అన్నారు. ఇస్రో ప్రణాళిక ప్రకారం భూమికి 15 లక్షల కి.మీ. సుదూరాన భారత అంతరిక్ష నౌకను మోహరించి సూర్యుడిని అధ్యయనం చేస్తారు. అయితే సూర్యుని అధ్యయనం చేయడం అంత సులభమా? అంటే సూర్యుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత – 6000 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత – 150 లక్షల డిగ్రీల సెల్సియస్ సూర్యుని శక్తిలో 12 బిలియన్ల వంతు మాత్రమే భూమికి చేరుతుంది సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 30 సెకన్లు పడుతుంది
ఆదిత్య L-1 ఏమి చేస్తుంది?
ఆదిత్య ఎల్-1 సోలార్ కరోనాగ్రాఫ్ సహాయంతో సూర్యుడికి చెందిన అత్యంత బరువైన భాగాన్ని అధ్యయనం చేస్తుంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు సూర్యగ్రహణం సమయంలో మాత్రమే సూర్యుని కరోనాను అధ్యయనం చేయగలుగుతున్నారు. ఇది కాస్మిక్ కిరణాలు, సౌర తుఫానులు, రేడియేషన్ అధ్యయనంలో సహాయపడుతుంది సౌర పవనాలను అధ్యయనం చేయడం వల్ల అవి భూమి విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ప్రయోగం 4 దశల్లో ..
ఆదిత్య ఎల్1 ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరిగింది. మొదటి దశలో 20 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వ్యాసార్థం కలిగిన రాకెట్‌లో 138 టన్నుల ఘన ఇంధనం నింపారు. దీని చుట్టూ ఆరు స్ట్రాఫాన్ బూస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 12 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. ఇవన్నీ కలిపి భారీ రాకెట్‌ను అంతరిక్షంలోకి మోసుకువెళ్లాయి.