భారత్ లోకి బీఎఫ్-7 వేరియంట్.. హైఅలర్ట్
భయపడుతున్నట్లే జరిగింది. చైనాలోని బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది
భయపడుతున్నట్లే జరిగింది. చైనాలోని బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్ లో ఒక మహిళకు బీఎఫ్ - 7 వేరియంట్ గా తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. చైనాలో ఊపుతున్న బీఫ్-7 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించడం ఆందోళనను కలిగిస్తుంది. ఈ వేరియంట్ వల్లనే చైనాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అన్ని విమానాశ్రాయాల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. మహిళతో పాటు మరో ముగ్గురిని ఐసొలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
వడోదరలో ఎన్ఆర్ఐ మహిళకు...
గుజరాత్ లోని వడోదరలో ఒక ఎన్ఆర్ఐ మహిళకు బీఎఫ్-7 వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎయిర్పోర్టుల్లో తిరిగి పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆదేశాలు జరీ చేసే అవకాశముంది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ లను తప్పనిసరి చేస్తూ నింధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేవలం 28 శాతం మంది మాత్రమే కరోనా బూస్టర్ డోస్ వేయించుకున్నారని తెలిపింది. మిగిలిన వారు కూడా బూస్టర్ డోస్ లు వేయించుకోవాలని చెప్పింది.