జేసీ సీరియస్..... ఆ వ్యాఖ్యలతో.....?

Update: 2018-09-21 04:30 GMT

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జె.సి. దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఏ నాయకుడైనా తమను కించపరిచేటట్లు మాట్లాడితే నాలుక కోస్తాం అని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించడంతో జేసీ వర్గీయులు మండి పడుతున్నారు. ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో పోలీసులు చేసిందంతా చేసి నిజాలు మాట్లాడతే నాలుక కోస్తారా? అంటూ రివర్స్ లో జేసీ వర్గీయులు విరుచుకుపడుతున్నారు. పోలీసు అధికారులు చేసిన కామెంట్స్ తో జేసీ సీరియస్ అయ్యారని తెలుస్తోంది.ప్రభోదానంద ఆశ్రమం విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు మరోసారి విరుచుకుపడే అవకాశముంది.

హిజ్రాలతో పోలుస్తూ......

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులకు, గ్రామస్థులకు మధ్య వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జేసీ దివాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభోదానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి వీడియోలతో సహా జేసీ చూపించారు. ప్రభోదానంద ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని సీఎంను కోరారు.

నాలుక కోస్తామంటూ.....

చంద్రబాబును కలసిన తర్వాత జేసీ మీడియాతో మాట్లాడుతూ ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. హిజ్రాల మాదిరిగా వ్వవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్లెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పోలీసుల ఎదుట హిజ్రాలతో నృత్యాలు చేయించడాన్ని పోలీసు అధికారుల సంఘం సీరియస్ గా తీసుకుంది. వెంటనే జేసీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. పోలీస్ పవర్ చూపిస్తామని హెచ్చరించింది. అయితే హద్దుమీరిన అధికారులకు గట్టి సమాధానం చెబుతామని జేసీ వర్గీయులు చెబుతున్నారు.మరి కాసేపట్లో జేసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది.

Similar News