స్టాలిన్ కు ఆహ్వానం వెనుక జగన్ ప్లాన్ ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ ను జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ ను జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ ను జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించగా వారు హాజరయ్యారు. అయితే, వీరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం వెనుక జగన్ పక్కా ప్లాన్ తోనే ఉన్నారట. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం రాష్ట్రానికి అవసరమని జగన్ భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఇక, డీఎంకే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమిళనాడులో అధికారంలోకి వస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు. పైగా ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ 23 మంది ఎంపీలను గెలుచుకుంది. ప్రత్యేక హోదా సాధించేందుకు కేసీఆర్, స్టాలిన్ సహకారం ఉంటే మేలని జగన్ భావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏపీకి పక్కనే ఉన్న ఈ రెండు రాష్ట్రాలు అభ్యంతరం తెలపకుండా కేసీఆర్, స్టాలిన్ తో మంచి సంబంధాలు నెరపాలని జగన్ ఆలోచన. అందుకే ఎన్నికల ఫలితాల ముందువరకూ చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నా స్టాలిన్ ను ఇవాళ జగన్ ఆహ్వానించారు.