బ్రేకింగ్ : జలీల్ కూతురికి ఫత్యా జారీ

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబనాపై మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్ కూతురు ఎన్నికలలో పోటీ చేయరాదని మతపెద్దలు [more]

Update: 2019-02-25 11:33 GMT

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబనాపై మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. జలీల్ ఖాన్ కూతురు ఎన్నికలలో పోటీ చేయరాదని మతపెద్దలు ఫత్వాజారీ చేశారు. ఈ మేరకు మత పెద్ద లు ఫత్వా జారీ చేయడంతో జలీల్ ఖాన్ రివర్స్ అవుతున్నారు. గతంలో 2009లో మాజీ మేయర్ మల్లికాబేగం కాంగ్రెస్ తరుపున పోటీ చేసినప్పుడు జలీల్ ఖాన్ మతపెద్దలచేత ఫత్వా జారీ చేయించారని మల్లికా బేగం మతపెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల్లో ఫత్వా జారీ చేయడం వల్లనే తాను ఓటమి పాలయ్యానని మల్లికా బేగం చెబుతున్నారు. అయితే ఫత్వాకు బెదిరిపోయేది లేదని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. తన కుమార్తె ఎన్నికల బరిలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముస్లిం మహిళలందరికీ ఈ ఫత్వా వర్తిస్తుందని మత పెద్దలు చెబుతున్నారు.

Tags:    

Similar News