ఎన్టీయార్‌కి ‘ఆస్కార్‌’ గౌరవం

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీయార్‌కి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆస్కార్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో జూనియర్‌ చోటు దక్కించుకున్నాడు. ఆస్కార్‌ అని మనమందరం పిలుచుకునే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌, ఆర్ట్‌ ్స అండ్‌ సైన్సెస్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. తన అఫీషియల్‌ సోషల్‌ మీడియా పేజ్‌లో జూనియర్‌ ఎన్టీయార్‌తో పాటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న టాలెంటెడ్‌ నటులను పరిచయం చేసింది.

Update: 2023-10-19 13:58 GMT

JR. NTR drug-free society Ad

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీయార్‌కి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆస్కార్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో జూనియర్‌ చోటు దక్కించుకున్నాడు. ఆస్కార్‌ అని మనమందరం పిలుచుకునే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌, ఆర్ట్స్ అండ్‌ సైన్సెస్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. తన అఫీషియల్‌ సోషల్‌ మీడియా పేజ్‌లో జూనియర్‌ ఎన్టీయార్‌తో పాటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న టాలెంటెడ్‌ నటులను పరిచయం చేసింది. జూనియర్‌తో పాటు అమెరికన్‌ నటులు కే హువా కువాన్‌, మార్షా స్టెఫానీ బ్లేక్‌, ఐరిష్‌ నటి కెర్రీ కాండన్‌, కెనడా, అమెరికాల్లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న రోసా సలాజార్‌ ఉన్నారు. మన దేశం నుంచి జూనియర్‌ ఎన్టీయార్‌కి మాత్రమే చోటు దక్కడం గమనార్హం.

‘అంకితభావం, అద్భుత ప్రతిభ కలిగిన ఈ నటుల ప్రదర్శనతో కథలు.. మన ఊహాశక్తికి సవాల్‌ విసురుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసులు దోచుకుంటాయి. ఈ నటులు విభిన్న నట కౌశలంతో... కాల్పనిక ప్రపంచానికి వాస్తవికతకు ఉండే హద్దులను చెరిపి వేశారు. తాము పోషించిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి.. ఆయా పాత్రల బాధలను, ఆనందాలను, విజయాలను తాము కూడా అనుభవించారు.’ అంటూ అకాడెమీ... జాబితాలో చోటు సాధించిన ఐదుగురు నటులను ప్రశంసించింది.

ఎన్టీయార్‌కు దక్కిన ఈ గౌరవం ఆయన అభిమానులకే కాకుండా తెలుగువారందరికీ గర్వకారణం. ఇటీవలే ఎన్టీయార్‌ ‘బావ’ అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగు వెలుగులు విరజిమ్మాడు. అంతర్జాతీయంగా ఎన్టీయార్‌ ప్రశంసలు అందుకుని.. ఆ వెలుగులను మరింత ప్రకాశింప చేస్తున్నాడు. రాజమౌళి ఆర్‌ ఆర్‌ ఆర్‌లో కొమురం భీంగా ఎన్టీయార్‌ నటనకు దునియా మొత్తం ఫిదా అంది. ఆస్కార్‌ ఉత్తమ నటుల్లో ఆయన కూడా పోటీ పడ్డారు. అయితే తృటిలో ఆ అవార్డు ఆయనను చేరుకోలేకపోయింది. కానీ అకాడెమీ మాత్రం జూనియర్‌ టాలెంట్‌ను గుర్తించి క్లాస్‌ ఆఫ్‌ యాక్టెర్స్‌ లిస్ట్‌లో చేర్చింది. 

Tags:    

Similar News