తొమ్మిది నెలల తర్వాత
కేసీఆర్ తన మంత్రివర్గాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల అనంతరం విస్తరించారు. తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా [more]
కేసీఆర్ తన మంత్రివర్గాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల అనంతరం విస్తరించారు. తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా [more]
కేసీఆర్ తన మంత్రివర్గాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల అనంతరం విస్తరించారు. తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త మంత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేటీఆర్, హరీశ్ రావులకు రెండో విడతలో స్థానం దక్కుతుందని భావించారు.
మహిళలకు చోటు…..
అయితే కేసీఆర్ తొలిసారి గెలిచినప్పుడు ఆయన మంత్రివర్గంలో మహిళలకు స్థానం లభించలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మహిళలకు మంత్రి వర్గ స్థానాలను కేటాయిచలేదు. అయితే మలివిడత విస్తరణలో ఇద్దరు మహిళలకు కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరగా, సత్వవతి రాథోడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ కేసీఆర్ మంత్రిని చేశారు.