బంద్ కు కేసీఆర్ మద్దతు

భారత్ బంద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. రైతులు దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మూడు వ్యవసాయ [more]

Update: 2020-12-06 05:46 GMT

భారత్ బంద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. రైతులు దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు సంఘీభావంగా ఈ నెల 8వ తేదీన దేశ వ్యాప్త బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి తమ మద్దతు ఉంటుందని, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవసాయ చట్టాలున్నాయని, అందుకే తాము పార్లమెంటులో వ్యతిరేకించామని కేసీఆర్ తెలిపారు.

Tags:    

Similar News