నేడు ఢిల్లీకి కేసీఆర్.. మూడు రోజుల పాటు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.  మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం [more]

Update: 2020-12-11 02:15 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం వివిధ కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశముంది. ప్రధాని మోదీ తో అపాయింట్ మెంట్ ఇంకా ఖారారు కాలేదని చెబుతున్నారు. ప్రధానంగా పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుదలపై మరోసారి కేసీఆర్ కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News