1. ఆదాయ పరిమితి పెంపు : దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి లక్షన్నరకు,పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచింది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు సంక్షేమ పథకాలు అందుకోవడానికి అర్హత సాధించారు.
2. ఆసరా పెన్షన్లు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5,043.92 కోట్లు ఖర్చు చేస్తూ 40 లక్షల మందికి ప్రతీ నెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు,
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ ను రూ.200 నుంచి రూ.10 00కి పెంచింది. వికలాంగులు, కళాకారుల పెన్షన్ ను రూ.500 నుంచి రూ.1,500కు పెంచింది.
3. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులకు ప్రతీ నెలా 1000 రూపాయల పెన్షన్ అందిస్తున్నది.
4. కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ : ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్షా 116 రూపాయలు అందిస్తున్నది.
5. కుటుంబంలోని ప్రతీ వ్యక్తికీ ఆరుకిలోల బియ్యం : సమైక్య రాష్ట్రంలో ఒక్కో వ్యక్తికి 4 కిలోల చొప్పున కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తున్నది.
6. విద్యార్థులకు సన్న బియ్యం: అన్ని ప్రభుత్వ హాస్టళ్లల్లో, పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాల్లోని 44.61 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్నారు.
7. అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉద్యోగం : ప్రతీ అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించింది. హైదరాబాద్ లో అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణంలో వుంది. ఉద్యమ కారులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది.
8. ప్రకృతి వైపరీత్యాలలో మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం: వడగండ్లు, భారీ వర్షాలు, వరదల లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు, పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 6 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తోంది
9. గుడుంబా నిర్మూలన –పునరావాస కార్యక్రమాలు: తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని ప్రభుత్వం తరిమికొట్టింది. గుడుంబా తయారీపై ఆదారపడిన ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేసి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించింది.
10. జి.ఓ.నెంబర్ 58 ద్వారా లక్షా 25 వేల మందికి పట్టాలు : ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాలలోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. జి.ఓ.నెంబర్ 58 కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తం లక్షా 25 వేల మందికి భూమి పట్టాలు పంపిణీ చేశారు.
11. జర్నలిస్టులు, హోంగార్డులు, డ్రైవర్లకు ప్రమాద బీమా : డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, 5 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పించింది.
12. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు : ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా బకాయిలను మాఫీ చేసింది. రవాణా పన్నును రద్దు చేసింది.
13. స్వయం ఉపాధి పధకాల కోసం ఆర్థిక సాయం: పేద యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా, రూ.50వేల వరకు, వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. లక్ష రూపాయల రుణం తీసుకునే వారికి 80 శాతం సబ్సిడీ అందిస్తున్నది. రూ.2 లక్షలలోపు యూనిట్ కు 70 శాతం, రూ.5 లక్షలలోపు యూనిట్ కు
60 శాతం సబ్సిడీని అందిస్తున్నది.
14. ఆత్మగౌరవ భవనాలు : హైదరాబాద్ లో అన్ని కులాలు తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాన్ని, నిధులను కేటాయించింది.
15. తక్కువ జీతాలు పొందేవారి జీతాలు పెంపు: హోంగార్డులు, అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐకెపి, సెర్ప్, నరేగా ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విఆర్ఎలు, విఎఓలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సిఆర్టిలు, అర్చకులు తదితర ఉద్యోగులందరి వేతనాలను ప్రభుత్వం పెంచింది. రేషన్ డీలర్ల కమిషన్ పెంచింది.
16. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం (సబ్ ప్లాన్): ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఆ నిధులను ఆ వర్గాల కోసమే ఖర్చుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఏదేని కారణం వల్ల ఖర్చు కాకుంటే మరుసటి సంవత్సరానికి బదిలీ చేసే విదంగా చట్టంలో
నిబంధన పెట్టారు.
17. గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు: గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా మార్చాలనే దీర్ఘకాలిక డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరింది. వంద శాతం ఎస్టీ జనాభాగల గ్రామ పంచాయతీలు కొత్తగా 1,326 ఏర్పడ్డాయి. షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామ పంచాయతీలు 1,311 వున్నాయి. తెలంగాణలో మొత్తం వంద శాతం ఎస్టీ జనాభా గల 2,637 గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇతర గ్రామాల్లో కూడా ఎస్టీలకు తమ జనాభా ప్రకారం రిజర్వేషన్ లభిస్తుంది. రాష్ట్రం మొత్తం కలిపి 3,402 మంది ఎస్టీలు సర్పంచులయ్యే అవకాశం ఏర్పడింది.
18. ఎస్సీలకు మూడెకరాల భూమి: రాష్ట్రలో ఇప్పటి వరకు రూ.503.53 కోట్లు వెచ్చించి 12,975 ఎకరాల భూమిని, 5,065 ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. 2018-19 బడ్జెట్లో దళితులకు భూమి పంపిణీ కార్యక్రమం కోసం రూ.1,469 కోట్లు కేటాయించారు.
19. ఎస్సీల కోసం వృత్తి నైపుణ్య శిక్షణలు: వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ యువకులకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వివిధ వృత్తుల్లో స్థిరపడేట్లు చేసింది.
20. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు: అన్నిఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను ప్రభుత్వం రిజర్వ్ చేసింది. హైదరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్ ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ (TS PRIDE) కార్యక్రమం అమలు
చేస్తున్నది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు, ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమలను విస్తరించాలనుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. వారు స్థాపించే పరిశ్రమలకు ఉపయోగించే విద్యుత్ చార్జీల్లో ఒక్కో యూనిట్ కు రూపాయిన్నర సబ్సిడీ ఇస్తున్నది.
చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామక వేత్తలు తీసుకున్న రుణాలపై కేవలం పావలా వడ్డీ చెల్లించే వెసులుబాటు కల్పించింది. పరిశ్రమల స్థాపనకు అయ్యే వ్యయంలో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ అందిస్తున్నది .
21. ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్: దేశంలో మరెక్కడా లేని విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి, కాంట్రాక్టు పనుల్లో ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది..
22. రిజర్వేషన్ల పెంపు: ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి, ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బీసీలకు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. పెంచిన రిజర్వేషన్ల అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
23. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు, పాత బకాయిల రద్దు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు తమ ఇండ్లకు ఉపయోగించే విద్యుత్తును 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. గృహ వినియోగం కేటగిరీలో రూ.70 కోట్లకుపైగా ఉన్న ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజనులపై గతంలో నమోదు చేసిన విద్యుత్ విజిలేన్స్ కేసులన్నింటినీ ఎత్తివేసింది.
24. మైనారిటీ సంక్షేమం కోసం భారీగా నిధులు: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మైనారిటీల సంక్షేమం కోసం రూ.4వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రూ.2 వేల కోట్లు కేటాయించింది.
25. రంజాన్, క్రిస్మస్ వేడుకలు: రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రతీ సంవత్సరం రాష్ట్రంలోని నిరుపేద మైనారిటీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తుల పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ముస్లిం ప్రార్ధనా మందిరాల్లో అధికారికంగా ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో క్రిస్మస్ విందులు ఏర్పాటు చేస్తున్నది.
26. టీఎస్ ప్రైమ్: మైనారిటీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టిఎస్ ప్రైమ్ పథకం అమలవుతున్నది. దీని ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాయితీలు, ప్రోత్సహకాలు కల్పిస్తున్నారు.
27. అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం: నాంపల్లిలో 4300 చదరపు గజాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో ముస్లిం అనాథలకు అనీస్ ఉల్ గుర్భా కొత్త భవనం నిర్మిస్తున్నది.
28. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణ: మైనారిటీ యువత వివిధ రంగాల్లో రాణించడానికి నాక్, ఇసిఐఎస్, సిఐపిఇటి, సెట్విన్ సంస్థల ద్వారా నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నది.
29. చర్చిల నిర్మాణ అనుమతులు సులభతరం: స్థానిక సంస్థల అనుమతితో చర్చ్ ల నిర్మాణం చేసుకునే వీలు కల్పించింది.
30. మక్కామసీదు అభివృద్ధి : నగరం లోని మక్కామసీదుకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8.48 కోట్లు మంజూరు చేసింది.
31. షాదీఖానాల నిర్మాణం: ముస్లింల సామాజిక వికాసం కోసం రాష్ట్రవ్యాప్తంగా పూర్తి ప్రభుత్వ ఖర్చుతో షాదీఖానా మరియు ఉర్దూ ఘర్ ల నిర్మాణం జరుగుతున్నది.
32. సిక్ గురుద్వారా నిర్మాణం: హైదరాబాద్ నగరంలో గురుద్వారా నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
33. ఇమామ్, మౌజమ్ లకు భృతి: దేశంలో మరెక్కడాలేని విధంగా మసీదుల్లో ప్రార్ధనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు 5000 రూపాయల భృతి అందిస్తున్నది.
34. ఇస్లామిక్ సెంటర్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలోని కోకాపేటలో 10 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల వ్యయంతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్‌హాల్ ను నిర్మిస్తున్నది.
35. ఉర్దూ భాషాభివృద్ధి: ప్రభుత్వం ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటించింది, విద్యార్థులు ప్రథమ భాష గా చదువుకునే అవకాశం కల్పించింది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో, కలెక్టరేట్లలో 66 మంది ఉర్దూ అధికారులను నియమించింది.
36. గొర్రెల పంపిణీ: రాష్ట్రంలోని గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీ పై రూ.4వేల కోట్ల తో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నది. ఉచితంగా దాణ, మందులు ఇస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నది.
37. ఉచితంగా చేపపిల్లల పంపిణీ: మత్స్యకారుల కోసం చెరువులు, ఇతర జలాశయాల్లో పెంచేందుకు ఉచితంగా చేపపిల్లల సరఫరా చేస్తున్నది.
38. చేనేత కార్మికుల సంక్షేమం: బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలను, హాస్పిటళ్లలో చద్దర్లు,
విద్యార్థులు, పోలీసులకు యూనిఫారాల వస్త్రాల కోసం నేత, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్నది. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్ టైల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నది. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసింది.
39. గీత కార్మికుల సంక్షేమం: తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక,పాత బకాయిలనూ మాఫీ చేసింది. లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది. హైదరాబాద్ లో కల్లు దుకాణాలను పునరుద్ధరించింది.
40. రజకులకు చేయూత: ప్రభుత్వం ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఆధునిక యంత్రాలతో లాండ్రీల ఏర్పాటు, వ్యక్తిగత ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ప్రభుత్వ దవాఖానలు, హాస్టళ్లలో
దుస్తులు ఉతికే బాధ్యత రజకులకే అప్పగించాలని నిర్ణయించింది.
41. నవీన క్షౌరశాలల ఏర్పాటు: నాయి బ్రాహ్మణులు క్షౌరశాలలు పెట్టుకునేందుకు వందశాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే సెలూన్లకు గృహ కేటగిరీ చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నది.
42. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహం: పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్ కరెంటు పై కు రూ. 2 చొప్పున సబ్సిడీపై అందిస్తున్నది. అంగన్ వాడీ సెంటర్లకు మధ్యాహ్న భోజన పథకానికి సోషల్ వెల్ఫేర్ పాఠశాలల కోసం గుడ్ల కొనుగోలు ద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు లాభం కలిగిస్తున్నది.
43. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థిక సాయం: వివిధ వృత్తులను ఆధునికరించుకొనే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి
చేసుకునేవారికి ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నది.
44. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ప్రత్యేక పథకాలు: ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం, కళ్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాల ఫలాలను
అన్ని కులాలలోని పేదలకు పంచుతున్నది. బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకోసం ప్రత్యేక పథకాలను రూపకల్పన చేసే
పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది.
45. బ్రాహ్మణ పరిషత్: బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి, ప్రతీ ఏడాది 100 కోట్లు కేటాయిస్తున్నది.
46. ధూపదీప నైవేద్యం పథకం: అన్ని దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కోసం ప్రభుత్వం నెలకు రూ. 6 వేలు అందిస్తున్నది.
47. అర్చకులకు ప్రభుత్వం జీతం: అర్చకులు, పూజారులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తున్నది.
48. జర్నలిస్టుల సంక్షేమం: జర్నలిస్టుల సంక్షేమానికి రూ.120 కోట్లను కేటాయించింది. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడంతో పాటు ఐదేండ్ల వరకు వారి కుటుంబానికి రూ.3 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నది.
గాయపడి నిస్సహాయ స్థితిలో వున్న వారికి రూ.50 వేలు సాయం చేస్తున్నది. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు ఇచ్చింది. ఉచిత బస్సుపాస్ లు ఇచ్చింది
49. న్యాయవాదుల సంక్షేమం: న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులను అందజేయాలని నిర్ణయించింది. న్యాయవాది జీవిత భాగస్వామికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా,
ప్రమాదంలో మరణించిన న్యాయవాది కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో అడ్వకేట్స్ ట్రస్ట్ ఒప్పందం చేసుకుంది.
50. మహిళా రిజర్వేషన్లు : మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
51. ‘కేసీఆర్ కిట్’: ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు గర్భిణీకి రూ.12వేల నగదు, రూ.3వేల కిట్ అందిస్తున్నారు. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనం.
52. అమ్మఒడి వాహనాలు: గర్భిణులను దవాఖానాకు తీసుకురావడానికి, ప్రసవం తర్వాత బిడ్డతో సహా ఇంటికి చేర్చడానికి అమ్మఒడి వాహనాలను(102 వాహనం) నడుపుతున్నది.
53. టూవీలర్ 108 వాహనాలు (బైక్ అంబులెన్స్ లు): ప్రమాద సందర్భాల్లో సత్వర సాయమందించేందుకు 108 బైక్ అంబులెన్సులు ప్రవేశ పెట్టింది.
54. రెక్కలు వాహనాల పథకం: ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి తల్లీబిడ్డలకు సేవలందించేందుకు రాయితీతో ద్విచక్ర వాహనాలను అందించింది. గర్భిణుల పేర్ల నమోదు, టీకాలు, ఇతర వైద్యసేవలకు 6,500 వాహనాలను సమకూరుస్తున్నారు.
55. ఆరోగ్య లక్ష్మి – పోషకాహారం: అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజూ ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందించే ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. గుడ్లతో పాటు గోధుమలు,
పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెలా అందిస్తున్నది.
56. మహిళా ఆర్గనైజర్లు: మాతాశిశు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం 16 మంది మహిళా ఆర్గనైజర్లను నియమించింది.
57. బాలికా ఆరోగ్యరక్ష పథకం : ప్రభుత్వపాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో చదువుకుంటున్న 8 లక్షలమంది విద్యార్థినులకు హెల్త్, హైజెనిక్ కిట్స్ అందిస్తున్నది.
58. స్త్రీ నిధి - పది లక్షల వరకు వడ్డీ లేని రుణం: 4.60 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లో 8.58 లక్షల కుటుంబాలకు ఉపయోగపడేలా వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
59. దివ్యాంగుల సంక్షేమం: దివ్యాంగులకు పూర్తిసబ్సిడీతో మోటరుసైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.850 నుంచి రూ.1500లకు పెంచింది. దివ్యాంగులకు 80 శాతం సబ్సిడీతో రూ.లక్ష రుణ సౌకర్యం కల్పించింది. రూ.10 లక్షల రుణానికి 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా దివ్యాంగులకు కూడా అన్ని రాయితీలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగులను పెళ్లి చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నది.
60. రైతులకు రుణమాఫీ: రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు చెందిన 16,124.37 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
61. రైతుబంధు-ఎకరానికి 8వేలు : ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8వేలను ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా అందిస్తున్నది. 58 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించడం కోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించింది
62. రైతు బీమా: 18 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న రైతులందరికీ ప్రభుత్వం ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ఒక్కో రైతుకు ఏటా రూ.2,271 ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోగానే నామినీకి 5 లక్షల సొమ్ము అందుతున్నది.
63. 24 గంటల ఉచిత విద్యుత్: రాష్ట్రంలోని 24 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నది.
64. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ: 2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేండ్లలో 37,45,102 మంది రైతులకు మొత్తం రూ.1325 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
అందింది.
65. ఏ. ఇ. ఒ . ల నియామకం: ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున రాష్ట్రంలో కొత్తగా 2,162 మంది వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది.
66. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు: రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది.
67. రైతు వేదిక నిర్మాణం: రైతులు పరస్పరం చర్చించుకోవడానికి ప్రతీ ఐదు వేల ఎకరాల వ్యవసాయ క్లస్టర్ కు ఒక రైతు వేదికను నిర్మిస్తున్నది.
68. భూ రికార్డుల ప్రక్షాళన: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూముల రికార్డుల ప్రక్షాళన జరిగింది. యాజమాన్యాల విషయంలో 94 శాతం స్పష్టత వచ్చింది. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేస్తున్నది. అభ్యంతరాలు కలిగిన భూములను రెండో దశలో పరిష్కరిస్తారు.
69. ‘ధరణి’ వెబ్ సైట్ : భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్‌లైన్ నిర్వహణ అంతా పకడ్బందీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా
నమోదు చేసుకుంటూ, ‘ధరణి’ వెబ్ సైట్ ను కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహిస్తుంది.
70. సాదాబైనామాలకు పట్టాలు: సాదా బైనామాల మీద జరిగిన భూముల క్రయవిక్రయాలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసింది.
71. సకాలంలో ఎరువులు, విత్తనాలు: రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సరఫరా చేస్తున్నది.
72. కల్తీకి పాల్పడే వారిపై పీడీ చట్టం: విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కల్తీచేసే వారిని, అమ్మే వారిని కఠినంగా శిక్షించడం కోసం ఈ నేరాలను పిడి చట్టం పరిధిలోకి తెచ్చింది.
73. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తున్నది.
74. సబ్సిడీపై ట్రాక్టర్లు: 50% నుంచి 90% శాతం సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం వ్యవసాయ ట్రాక్టర్లు అందిస్తున్నది. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్నును కూడా రద్దు చేసింది. నాలుగేళ్లలో 14 వేల ట్రాక్టర్లు పంపిణీ చేసింది. ట్రాక్టర్లకు రోడ్ టాక్స్, కమర్షియల్ టాక్స్,
టెంపరరీ రిజిస్ట్రేషన్, కమర్షియల్ రిజిస్ట్రేషన్ టాక్స్, జిఎస్టీని మినహాయించింది.
75. రైతు బజార్లు: రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు చౌకధర లభించడం కోసం ప్రభుత్వం 59 రైతు బజార్లు నిర్వహిస్తున్నది.
76. సబ్సిడీపై బర్రెల పంపిణీ-పాల సొసైటీలకు లీటరుకు రూ.4 ఇన్సెంటివ్: పాల సొసైటీలకు చెందిన 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై బర్రెలు అందించేందుకు ఒక్కో యూనిట్ కు 80 వేల రూపాయలు కేటాయించింది. రవాణా ఖర్చుల కోసం మరో ఐదు వేల రూపాయలు అదనంగా అందిస్తున్నది. ఎస్సీ ఎస్టీ లకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పాడి రైతులకు లీటరుకు 4 రూపాయలు ప్రోత్సాహకంగా అందజేస్తున్నది.
77. దేశంలోనే తొలిసారిగా సంచార పశువైద్యశాలలు: ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 100 సంచార పశువైద్యశాలలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 1962 నంబర్‌కు ఫోన్ చేసిన అరగంటలో సంచార పశు వైద్యశాల వస్తుంది.
78. మైక్రో ఇరిగేషన్ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల రైతులకు 100% రాయితీ, వెనుకబడిన తరగతులకు మరియు సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ, ఇతర రైతులకు 80% రాయితీలు ఇస్తున్నది.
79. పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సబ్సిడీ: 75శాతం సబ్సిడీతో పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ అందిస్తున్నది. 80. గోదాముల నిర్మాణం – కోల్డ్ స్టోరేజ్ లింకేజ్: తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల
మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 18.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన 364 గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 22.47 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 540 గోదాములు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ లింకేజి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
81. స్పెషలైజ్డ్ మార్కెట్లు: నల్లగొండ జిల్లా గంధంవారిగూడెం దగ్గర 1.50 కోట్లతో బత్తాయి మార్కెట్ ను, నకిరేకల్ లో 3.07 కోట్లతో నిమ్మకాయల మార్కెట్ ను, పి.ఏ.పల్లి మండలం కొనమేకలవారిగూడెం దగ్గర 60.30 లక్షలతో దొండ మార్కెట్ ను ఏర్పాటు
చేస్తున్నది. మామిడి మార్కెట్ ను కొల్లపూర్లో నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.
82. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేశారు. రిజర్వేషన్ల వల్ల 25 మంది ఎస్సీలు, 10 మందిఎస్టీలు, 50 మందిబీసీలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లు కాగలిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వల్ల, 60 మంది మహిళా రైతులు చైర్మన్లు అయ్యారు.
83. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని లక్షన్నర రూపాయలు నుంచి ఆరు లక్షలకు పెంచింది.
84. నీటి తీరువా రద్దు: నీటితీరువా పన్ను బకాయిలను మాఫీ చేసింది. పన్ను విధానాన్ని రద్దు చేసింది. సాగునీటి రంగం
85. ప్రాజెక్టుల నిర్మాణం :గోదావరి, కృష్ణ నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులను
ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్లో ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది.
86. మహారాష్ట్రతో ఒప్పందం: గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చారిత్రాత్మక
ఒప్పందం చేసుకున్నది.
87. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి: కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, మిడ్ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కొమురంబీమ్, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్ పూర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. మొత్తం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్ మాట్ బ్యారేజి, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం చేపట్టింది. అసంపూర్తిగా
ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, 365 రోజుల పాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేందుకు
గోదావరిపై తుపాకుల గూడెం బ్యారేజిని నిర్మిస్తున్నది. 88. పాలమూరు-రంగారెడ్డి: పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి,
వికారాబాద్ జిల్లాల్లోని భూములకు సాగునీరు అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నది.
89. భక్త రామదాసు – సీతారామ ప్రాజెక్టు: రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతలను నిర్మించింది. ఖమ్మం
జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో ఉంది.
90. కాళేశ్వరం ప్రాజెక్టు: నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన 40 లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తీ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి.
91. మిషన్ కాకతీయ: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. 46,500 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్రధానమైన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు,
కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి.
92. మిషన్ భగీరథ: ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం చేపట్టింది. రూరల్ ప్రాంతాల్లోని 24,248 ఆవాస ప్రాంతాలకు, 52.47 లక్షల నివాసాలకు, 65 అర్బన్ ఏరియాల్లోని 12.83 లక్షల నివాసాలకు నీరు
అందనుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిథిలోని 7 అర్బన్ లోకల్ బాడీలు, రూరల్ ప్రాంతాల్లోని 183 ఆవాస గ్రామాలకు ఈ పథకం ద్వారా నీళ్లు అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు ప్రతీరోజు సురక్షిత త్రాగు నీరు అందించనున్నారు.
93. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: నిరుపేదలఆత్మ గౌరవం కాపాడేలా 560 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 2,72,000 ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉంది.
94. తెలంగాణకు హరితహారం: తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడం కోసం తెలంగాణకు హరితహారం చేపట్టింది. ఇప్పటి వరకు 82 కోట్ల మొక్కలు నాటారు. 2019 నుంచి ప్రతీ గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 100 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
95. పరిపాలన సంస్కరణలు: ప్రజలకుపరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలను విజయ వంతంగా అమలు చేసింది. చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు
మరెక్కడా జరగలేదు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగాన్ని, పారదర్శకతను పెంచడం కోసం, 10 జిల్లాలను 31 జిల్లాలు చేసింది. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు
చేసింది. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో 8,690 గ్రామ పంచాయితీలుంటే, కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ప్రజలు ఇటీవలే కొత్త గ్రామ పంచాయితీల, కొత్త మున్సిపాలిటీల ప్రారంభోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రభుత్వం పోలీస్ శాఖలోనూ కూడా భారీగా పాలనా సంస్కరణలు తెచ్చింది. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రెండే రెండు పోలీస్ కమీషనరేట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 9 కి పెంచుకున్నాం. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు పెంచుకున్నాం. సర్కిల్ కార్యాలయాలను 688 నుంచి 717కు పెంచుకున్నాం. పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు పెంచుకున్నాం.
96. సమీకృత జిల్లా కలెక్టరేట్లు & జిల్లా అధికారుల కార్యాలయాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు(డీపీవో)లు ప్రభుత్వం నిర్మిస్తున్నది.
97. కోతల్లేని విద్యుత్: రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే, నేడు 16వేల మెగావాట్లకు చేరింది. 28 వేల మెగావాట్ల విద్యుత్
ఉత్పత్తి సాధించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడం కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది.
98. రహదారుల నిర్మాణం : 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే,
కేవలం నాలుగేళ్లలోనే అంతకన్నా ఎక్కువగా 3,155 కిలోమీటర్ల నిడివి 36 జాతీయ రహదారులను ప్రభుత్వం మంజూరు
చేయించుకోగలిగింది. దీనివల్ల నేడు తెలంగాణలో మత్తం 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్ వర్క్ ఏర్పడింది. 16వేల
కోట్ల ఖర్చుతో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లను, వంతెనలను అభివృద్ది చేసింది. వేల సంఖ్యలో ఉన్న మట్టి రోడ్లను బిటి రోడ్లుగా మార్చింది. సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1146 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టింది.
99. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగు రోడ్డు: ఇప్పుడున్న ఔటర్ రింగు రోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్ రింగు రోడ్డు
నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి- గజ్వేల్-చౌటుప్పల్-మాల్-కడ్తాల్-షాద్ నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ వలయాకారంలో 6 లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్ ప్రెస్ 18 హైవేగా రీజనల్ రింగురోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
100. ఎమ్మెల్యేలకు కార్యాలయాలు: ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని నిర్మిస్తున్నది.
101. కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు: తెలంగాణ ఏర్పాటకు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. కేవలం మూడేళ్లలో కొత్తగా 663 ( 610 + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసింది. ఎస్సీలకు 134, ఎస్టీలకు 64, బిసిలకు 261, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయి.
102. విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నది.
103. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ స్టడీ సర్కిల్స్: పోటీ పరీక్షలకు సన్నధ్దం కావడం కోసం జిల్లా స్థాయిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ స్టడి సర్కిళ్లను ఏర్పాటు చేసింది.
104. మెరుగైన వైద్య సేవలు: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో బెడ్ నిర్వహణకు ప్రతీ నెల సగటున రూ.5,016 రూపాయలు ఖర్చు చేస్తున్నది. 600 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల కోసం కొత్త వైద్య సామాగ్రి కొనుగోలు చేసింది. రాష్ట్ర
వ్యాప్తంగా 40 డయాలిసిస్ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 25 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూలు, 12 చోట్ల క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది.
105. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు: నగరంలోని వివిధ డివిజన్లలో ప్రభుత్వం బస్తీ దవాఖానాల(అర్బన్ హెల్త్ క్లీనిక్)ను ప్రారంభించింది. పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తొలివిడతగా 50 బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. 106. కంటి వెలుగు: అందరికీ కంటి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం కంటి వెలుగు పథకం అమలు చేస్తున్నది. ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేయడంతో పాటు ఆపరేషన్లు కూడా ఉచితంగానే జరిపిస్తున్నది.
107. పరమపద వాహనాలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారి మృత దేహాలను ఉచితంగా ఇంటికి పంపడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ఏర్పాటు చేసింది.
108. ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగులందరికీ తెలంగాణ సాధన ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేసింది. సకల జనుల
సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా నిర్ణయించింది. 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు
గ్రాట్యుటీని చెల్లిస్తున్నది. హెల్త్ కార్డులు అందించింది.
109. కొత్త జోనల్ వ్యవస్థ: స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా తెలంగాణలో నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కొత్త జోనల్ విధానం ప్రకారమే పెద్దఎత్తున నియామకాలు
జరుగనున్నాయి. టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా ఇప్పటివరకు గుర్తించిన ఉద్యోగ ఖాళీలు 32,733. భర్తీ చేసినవి 11,333. ఫలితాలు రావాల్సివున్నది 21,094. పరీక్షలకు సిద్దంగా వున్నవి 306. నోటిఫికేషన్లకు సిద్ధంగా వున్నవి 8,206. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు జరిగిన నియామకాలు 25,004. రిక్రూట్ మెంట్ ద్వారా 2,681, రెగ్యులరైజేషన్ ద్వారా 22,323, కొత్త నియామకాలు జరగాల్సినవి 3,600. పోలీసు శాఖలో ఇప్పటివరకు జరిగిన నియామకాలు 10,980. కొత్త నియామకాలు జరగాల్సినవి 25,000. సింగరేణిలో మొత్తం నియామకాలు 9,884. నేరుగా జరిగిన నియామకాలు 5,500. డిపెండెంట్ ఉద్యోగాలు 4,384. ఆర్టీసీలో 4,020 మంది
రెగ్యులరైజేషన్, డిపెండెంట్ ఉద్యోగాలు 1,137. యూనివర్సిటీలు, కార్పోరేషన్లు, సొసైటీలలో మొత్తం 20,614. ఇప్పటి వరకు జరిగిన నియామకాలు 9,614. కొత్తగా చేపట్టే నియామకాలు 11,000.
110. టీఎస్ ఐపాస్ - సింగిల్ విండో విధానం: పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులిచ్చేందుకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ ఎండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (TS IPASS) చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 15 ఆగస్టు, 2018
నాటికి రూ.1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్‌విధానం ద్వారా 7,697 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. వీటిలో 2.50 లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందారు.
111. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) : ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. మే 2018 నాటికి 1500 ఐటీ/ఐటీఇఎస్ కంపెనీల్లో 4.75లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా, 7లక్షల మందికి పరోక్షంగా ఉపాధి
లభించింది. ఐటి ఎగుమతులు లక్ష కోట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్ లోని ఐటి ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు
చేస్తున్నారు.
112. శాంతిభద్రతలు: పోలీసు శాఖ ను బలోపేతం చేయడం వల్ల సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతున్నది.
రాష్ట్రం అంతటా లక్షలాది సీ సీ కెమెరాలను పెట్టి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. హైదరాబాద్ లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం అవుతుంది. షీ టీమ్స్ కృషి ఫలితంగా మహిళలకు భద్రత ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులకు 30 % కాలుష్య అలవెన్స్ ఇస్తున్నది.
113. విశ్వనగరంగా హైదరాబాద్: 35 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ప్రభుత్వం వివిధ నిర్మాణ కార్యక్రమాలను
చేపట్టింది. ట్రాఫిక్ సమస్య నివారణకు వ్యూహాత్మక రహదారుల అబివృద్ధి పథకం కింద రూ. 25వేల కోట్ల రూపాయలతో ప్లై ఓవర్లు, ఎక్స్ ప్రెస్ వేలు ఉపరితల రహదారులు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నారు. రహదారులు అభివృద్ధిపరచడానికి 2,716 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. తాగునీటి అవసరాలు తీర్చే విధంగా 20 టి.ఎం.సిల సామర్థ్యంతో రెండు జలాశయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. వచ్చే ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను మెరుగుపరిచే ప్రణాళిక అమలవుతుంది.
114. సింగరేణి కార్మికుల సంక్షేమం: సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా చెల్లిస్తున్నది. ఇండ్లు కట్టుకోవడానికి 10 లక్షల వడ్డీ లేని రుణం అందిస్తున్నది.
సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన పిఆర్పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను
వెంటనే విడదుల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారుణ్య నియామకాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసింది.
115. పదవ తరగతి వరకు తప్పని సరిగా తెలుగు: అన్ని విద్యాసంస్థల్లో పదవ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
116. తెలంగాణ ఆలయాల అభివృద్ధి: యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర, ధర్మపురి, జోగులాంబ, కొమురవెల్లి మల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు, నాగార్జున కొండ వంటి బౌద్దారామాల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
117. అధికారికంగా తెలంగాణ పండుగలు: రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక హోదా కల్పించింది.
118. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు: బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద మహిళలందరికీ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నది.
119. తెలంగాణ ప్రముఖులకు అధికారికంగా జయంతి, వర్థంతి: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన తెలంగాణ ప్రముఖుల జయంతులను, వర్థంతులను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వారి పేరు మీద విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను నెలకొల్పింది.కొమురం బీం, జయశంకర్ ల పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది.