ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారని జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ తెరదించారు. [more]

Update: 2021-02-08 01:00 GMT

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారని జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ తెరదించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొందరు చూస్తున్నారని కటువుగానే అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తాను చెప్పానని, ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని కేసీఆర్ తెలిపారు. సీఎం మార్పు పై ఇక ఎవరూ మాట్లాడవద్దని కేసీఆర్ నేతలకు హెచ్చరించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తెలిపారు.

Tags:    

Similar News