Kcr : వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ

యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ వచ్చే ఏడాది మార్చి 28న జరగనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి ఎనిమిది రోజులు ముందుగా మహా సుదర్శన యాగం [more]

Update: 2021-10-19 14:13 GMT

యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ వచ్చే ఏడాది మార్చి 28న జరగనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి ఎనిమిది రోజులు ముందుగా మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. సుదర్శన యోగం నిర్వహించే రుత్వికులు అది పూర్తి చేసుకున్న తర్వాత మహా కుంభ సంప్రోక్షణ జరుగుతుందని తెలిపారు. ఉదయం నుంచి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 1008 కుండలాలతో మహా సుదర్శన యాగం జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. యాదాద్రిలో స్వామి వారి గాలి గోపురానికి బంగారం తాపడం చేయించాలని నిర్ణయించామన్నారు. 125 కిలోల బంగారం పడుతుందని నిపుణులు తెలిపారన్నారు. దీనివిలువ 60 కోట్లవుతుందని తెలిపారు. నిధులను ప్రజలనుంచి సమీకరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బాంగారాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. తన కుటుంబం నుంచి కిలో 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా ఇస్తామని చెప్పారు.

Tags:    

Similar News