బిగ్ బ్రేకింగ్ : కేసీఆర్ సంచలన నిర్ణయం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. విధులకు హాజరుకాని ఆర్టీసీ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. [more]

Update: 2019-10-06 16:03 GMT

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. విధులకు హాజరుకాని ఆర్టీసీ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆర్టీసీలో ఇప్పుడు మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీలో 2500 అద్దె బస్సులు నడుపుతామని కేసీఆర్ తెలిపారు. బ్లాక్ మెయిల్ చేస్తే ప్రభుత్వం తలవంచదని కేసీఆర్ చెప్పారు. కొద్దిరోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఇకపై చర్చలు కూడా ఉండవని కేసీఆర్ తెలిపారు. ఇకపై ఆర్టీసీ, ప్రయివేటు భాగస్వామ్యంతోనే బస్సులు నడుపుతామని తెలిపారు. కొత్తగా చేరే ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి యూనియన్ లో చేరబోమని సంతకం చేయాలని చెప్పారు. అయితే దీనిపై ఆర్టీసీ జేఏసీ స్పందించింది. సమ్మె విరమించే ప్రసక్తి లేదని తెలిపింది.

Tags:    

Similar News