కోలుకుంటున్న కేసీఆర్.. వైద్యపరీక్షల్లోనూ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. త్వరలోనే ఆయన కోవిడ్ నుంచి బయటపడతారని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన కేసీఆర్ గజ్వేల్ [more]

Update: 2021-04-22 01:02 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. త్వరలోనే ఆయన కోవిడ్ నుంచి బయటపడతారని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన కేసీఆర్ గజ్వేల్ లోని ఫాం హౌస్ లో హోం క్వారంటైన్ లో ఉన్నారు. అక్కడ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. చాలా స్వల్పంగా కరోనా రావడంతో కేసీఆర్ మామూలుగానే ఉన్నారని, ఆయన అన్ని పనులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. కాగా కేసీఆర్ ను ఆయన కుమారుడు కేటీఆర్ కలిసి మాట్లాడి వచ్చారు. త్వరలోనే కోవిడ్ నుంచి బయటపడి సాధారణ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే స్కానింగ్ చేయడం కోసం కేసీఆర్ నిన్న హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. ఆయన రిపోర్టులు కూడా నార్మల్ గా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News