అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది . ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులు [more]
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది . ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులు [more]
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది . ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులు ముఖ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మొత్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.