వాస్తు, జ్యోతిష్యం అంటే ఆయనకు ఆపార నమ్మకం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి. టైం, టైమింగ్ ను నమ్ముకుని ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఆయనకు వ్యాపకం. ఆయన నాలుకే కత్తిలా మార్చుకుని దాడి చేస్తారు. ప్రస్తుతం ఆయన ఎపి సీఎం చంద్రబాబు కి ఎప్పుడెప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా అని కలలు కంటున్నారు. అందుకే ఆయన ఎపి వైపు ముహూర్తం చూసుకుని బయల్దేరారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ కు వాస్తు ప్రకారం తూర్పు ఉత్తరాన వున్న విశాఖపట్నం కి కావడం గమనార్హం.
అందుకే విశాఖ ...
వాస్తవానికి కెసిఆర్ ఏపీలో అడుగుపెట్టాలంటే ఎక్కడైనా దిగొచ్చు. కానీ వాస్తు ప్రకారం, ముహర్తం ప్రకారం పద్ధతిగా చేసే అలవాటు కెసిఆర్ ది కావడం చర్చనీయాంశం అవుతుంది. గతంలో తెలంగాణ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతి, అమరావతి వచ్చిన కెసిఆర్ ఇప్పుడు మాత్రం ఏపీకి ప్రత్యేక అతిధిగానే లెక్కల్లోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఏపీలో ఆయన ప్రతికదలిక తెలుగు తమ్ముళ్లు నిశీతంగా పరిశీలిస్తారు.
అందుకేనా?
చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం తధ్యమని చెప్పిన తరువాత గులాబీ బాస్ శారదా పీఠం లో అడుగుపెట్టడం ప్రత్యేక పూజలు చేయనుండటం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎన్నికలకు ముందు శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్ ఫామ్ హౌస్ లో చండీయాగం నిర్వహించారు. యాగం తర్వాతనే ఆయన ప్రచారానికి బయలుదేరారు. స్వామికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేకంగా విశాఖ కేసీఆర్ వస్తున్నారా? లేక బాబు ఓటమికోసమే ఆయన పూజల లేక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకా అన్నది కాలమే చెప్పనుంది.