దేశంలోని వ్యవస్థలను నరేంద్ర మోదీ - అమిత్ షా ధ్వయం ఆగం పట్టిస్తుందని, దేశాన్ని నాశనం చేస్తుందని బీజేపీ వ్యతిరేకులు... కాదుకాదు దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుందని నిత్యం చెబుతూనే ఉన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అమిత్ షా పేరునే మర్చిపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఏ యుద్ధంలోనైనా ఓడిపోలేదని, కచ్చితంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
గోవర్ధన్ ల విషయంలోనూ గందరగోళం
నరేంద్ర మోదీకి మతం అనే బీమారి ఉందన్నారు నిన్న బీజేపీ ప్రసిడెంట్ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడాడని... రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పారని చెప్పిన కేసీఆర్ ఆయన పేరేంటని పక్కన ఉన్న వారిని అడగగా... వారు అమిత్ షా అని గుర్తు చేశారు. అయితే, ప్రత్యర్థుల పేర్లు పక్కని వారితో చెప్పించడం కేసీఆర్ శైలి. ఇక, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీల హక్కులు సాధించుకోవాలంటే బిచ్చం ఎత్తుకుంటే ఎవడూ ఇవ్వడని, దేశంలో ఫెడరల్ ప్రభుత్వం రావాలన్నారు. హైదరాబాద్ లో ఎట్లాగూ అసద్ భాయ్ గెలుస్తాడని, మిగతా 16 కి 16 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీలను కూడా గెలిపించుకోవాలన్నారు. ఇక ఇదే సభ చివరలో ‘గంపా గోవర్ధన్ కారు గుర్తుకే మన ఓటు’ అంటూ కేసీఆర్ నినాదమిచ్చారు. పక్కనే ఉన్న వారు గుర్తు చేయగా మళ్లీ ‘బాజిరెడ్డి గోవర్ధన్’ గారికే మన ఓటు’ అని నినదించడం గమనార్హం.